-->
Bigg Boss 5 Telugu: నారీ నారీ నడుమ మురారీ.. జెస్సీ ఆశలు మాములుగా లేవుగా..

Bigg Boss 5 Telugu: నారీ నారీ నడుమ మురారీ.. జెస్సీ ఆశలు మాములుగా లేవుగా..

Bigg Boss

బిగ్‏బాస్.. విజయవంతంగా 60 రోజులు పూర్తిచేసుకుంది. రోజు రోజూకీ ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇక టాస్కులలోనూ ఇంటిసభ్యులు తామని తాము నిరూపించుకుంటారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో కెప్టెన్సీ టాస్కు కంటిన్యూ అయ్యింది. మానస్‏ను నామినేషన్స్ నుంచి సేవ్ చేసినందుకు శ్రీరామ్ సంతోషంగా లేడని రవితో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్.. ఆ తర్వాత శ్రీరామ్ యానీ మాస్టర్ వద్దకు వచ్చి.. మీకు అన్ని టాస్కులలో సహయం చేస్తున్నాను.. కానీ మీ పవర్ ను మాసన్ కోసం ఉపయోగించడం నాకు అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.. నన్ను సేవ్ చేయండని నేను అడగలేను కదా.. మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు.. సన్నీ, మానస్.. నామినేషన్స్ గురించి.. ప్రియాంక గురించి ముచ్చట్లు పెట్టారు. ప్రియాంక గేమ్ ఆడడం లేదని.. పూర్తి ద్యాసంత మానస్ పై పెట్టిందని ఇంటి సభ్యులు ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఇక జెస్సీకి మెడలు పట్టేయడంతో బెడ్ పై కూర్చోని రెస్ట్ తీసుకుంటున్నాడు. జెస్సీకి ఓవైపు సిరి కూర్చోగా.. మరోవైపు పింకీ కూర్చింది.. దీంతో జెస్సీ వింత వింత కోరికలు కోరుతూ.. పులిహర కలపడం స్టార్ట్ చేశాడు.. నా బుగ్గలు ఖాళీగా ఉన్నాయి.. ఇద్దరూ ముద్దులు పెట్టోచ్చుగా అని అడిగాడు.. దీంతో కెమెరా నుంచి కాలు బయటకు వచ్చి తన్నుంతుందని కౌంటర్ వేసింది సిరి. నేను పెట్టను అని చెప్పేసింది సిరి. ఇక ప్రియాంక మాత్రం జెస్సీ గడ్డాలు పట్టుకుని అతడితో ఆటలాడింది.. మీరిద్దరూ నా బేబీలు అని..సిరి పెద్ద బేబీ అంటూ తెగ పులిహోర కలపాడు..ఇక సిరి కూడా ఏమాత్రం తగ్గకుండా బదులిచ్చింది. నీకు నా తర్వాత ఎవరైనా అంటూ జెస్సీకి సెటైర్స్ వేసింది. మొత్తానికి అనారోగ్యంగా ఉన్న జెస్సీ పులిహోర పనులు మాత్రం ఆపడం లేదు..

Also Read: Major Movie: 26/11 అమ‌ర వీరుడు సందీప్ కృష్ణ‌న్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది.. మేజర్ విడుద‌ల ఎప్పుడంటే..

Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wdWzug

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: నారీ నారీ నడుమ మురారీ.. జెస్సీ ఆశలు మాములుగా లేవుగా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel