
Bank Loan: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు అందించే బ్యాంకులు ఇవే..!

Bank Loan: ప్రస్తుతం పండగ సీజన్‌లో ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పాలి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇక లోన్‌కు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేశాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ప్రస్తుతం పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి.
తక్కువ వడ్డీ రేటులో భాగంగా యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. ప్రస్తుతం 8.9 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. ఐదు సంవత్సరాల కాలపరిమితితో రూ.5 లక్షల వరకు లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ రూపంలో రూ.10,355 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేటు 8.95 శాతంగా ఉంది.
అలాగే ఇండియన్ బ్యాంకులో వ్యక్తిగత రుణాలపై 9.05 శాతం వడ్డీ రేటు, అలాగే ఎస్‌బీఐలో 9.6 శాతంగా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10 శాతం, రూ.9.05 శాతం, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో 9.45 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 9.5 శాతం, పంజాబ్ అంద్ సింద్‌లో 9.5 శాతంగా ఉన్నాయి. అదే విధంగా అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 10.25 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. ఇక కెనరా బ్యాంకులో 11.25 శాతం, యస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో 10.5 శాతంగా వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Sugar Price: అక్కడ పెట్రోల్ కంటే చక్కెర ధర దూసుకుపోతోంది.. కిలో పంచదార ఖరీదు రూ.150
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3o2qOAJ
0 Response to "Bank Loan: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు అందించే బ్యాంకులు ఇవే..!"
Post a Comment