-->
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణాతి దారుణం.. ఆబోతులకు విష గుళికలు పెట్టిన దుండగులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణాతి దారుణం.. ఆబోతులకు విష గుళికలు పెట్టిన దుండగులు..!

Poison

Andhra Pradesh: అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. దైవ స్వరూపంగా భావించే ఆబోతులకు విషా ఆహారం పెట్టి చంపిన దుండగులు. ఒక ఆబోతు మృతి చెందగా.. మరో ఆబోతు పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని కామాక్షి పీఠం గోశాల సమీపంలో ఆబోతులకు విష ఆహారం (గుళికలు) పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆబోతులకు విషాహారం పెట్టినవారిని విచారించి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గో ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో రెండు ఆబోతులకు గుర్తు తెలియని దుండగులు విష గుళికలు ఆహారంగా పెట్టారు. వాటిని తిన్న రెండు ఆబోతులలో ఒకటి మృతి చెందగా మరొకటి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆబోతుకు వైద్యం చేయించారు గో ప్రేమికులు, స్థానికులు. చనిపోయిన ఆబోతును గోతిలో పూడ్చి పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించారు. అయితే, ఆబోతులకు విషాహారం పెట్టినవారిని పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గో ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FWpuGK

0 Response to "Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణాతి దారుణం.. ఆబోతులకు విష గుళికలు పెట్టిన దుండగులు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel