
Andhra Pradesh: ఆయనను ప్రశ్నిస్తే చాలు కోపం వస్తది.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

Andhra Pradesh: ఉప్పెనలా వరదలు వస్తే బ్రతకడానికి అధికార పార్టీ రెండు వేల ఇచ్చిందని, అదే ఎన్నికల్లో గెలవడానికి మాత్రం పదివేలు ఇచ్చిందని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో ముంపు ప్రాంత ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 27, 28, 29 తేదీల్లో మరో తుఫాన్ వస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. ప్రమాదానికి కారణమైన తెగిన కరకట్టకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, లేదంటే విపత్తు మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఎలక్షన్ వస్తే మాత్రం వేలు పెట్టి కొంటారు.. కష్టం వస్తే బిచ్చం వేసినట్టు రెండు వేల ఇచ్చారు.. అంటూ వైసీపీ ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు చంద్రబాబు. కష్టాల్లో ప్రజలున్నప్పుడు.. పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చాడని, మద్యం బాగా అమ్మి ఆదాయం వస్తే అమ్మ ఉడి ఇస్తాడట అని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో గంజాయి అమ్మి.. మీ పిల్లల చేత తాగించి.. సంక్షేమ పథకాలు ఇస్తాడు అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇల్లు కూలిన వారికి లక్ష రూపాయలు మన డబ్బు మనకివ్వడానికి బాధ ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం ప్రశ్నించాలి.. అధికార పక్షం పనిచేయాలి అని వ్యాఖ్యానించారు. కానీ, ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే కోపం వస్తుందని అన్నారు. తెలుగుదేశం వారి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించడం పద్ధతి కాదని ప్రభుత్వ వర్గాలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని చంద్రబాబు చాలెంజ్ విసిరారు.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nQrREW
0 Response to "Andhra Pradesh: ఆయనను ప్రశ్నిస్తే చాలు కోపం వస్తది.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!"
Post a Comment