
Andhra Pradesh Govt News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..!

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆదర్శ పాఠశాలల్లో టీచర్ల బదిలీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన బదిలీ మార్గదర్శకాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీలకు సాధారణ బదిలీలు, 2021 నవంబర్ 1కి ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారు బదిలీకి అర్హులను పేర్కొంది. ఒకేచోట 2 ఏళ్లు చేసిన టీచర్లు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేయవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఖాళీలు, సీనియారిటీ, సర్వీస్ పాయింట్లు, ఆరోగ్య అంశాల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపడతామని తెలిపింది. డిసెంబర్ 31లోగా బదిలీల షెడ్యూల్ జారీ చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3o7x5MD
0 Response to "Andhra Pradesh Govt News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..!"
Post a Comment