
Akhanda: బాలయ్య గర్జనకు షేక్ అవుతున్న యూట్యూబ్..ఆకట్టుకుంటున్న”అఖండ” సాంగ్..

Akhanda: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన ఈ పాట ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలిచేలా ఉంది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించడం ప్రత్యేకమైన విషయం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు.
మొదటగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆ పాట తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరల్ అయింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ పాట. విదులైన 14 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ను దాటింది ఈ పాట. ఇక ఈ పాటలో బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు. అలాగే అనంత్ శ్రీరామ్ అదిందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సినిమాలో బాలయ్య క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో ఈ పాట వింటే అర్ధమవుతుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే
Eesha Rebba: వొంపు సొంపులతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న ఈషా రెబ్బ
Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bUN6yM
0 Response to "Akhanda: బాలయ్య గర్జనకు షేక్ అవుతున్న యూట్యూబ్..ఆకట్టుకుంటున్న”అఖండ” సాంగ్.."
Post a Comment