
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గూడ్ న్యూస్.. రోజుకు 500 ఎంబీ డేటా ఉచితం..

ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలు పెంచిన ఎయిర్‌టెల్.. తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రతిరోజు ఎయిర్‌టెల్ అందిస్తున్న 500 ఎంబీ డేటా ఉచితంగా పొందాలంటే సంబంధిత ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ నంబర్‌పై రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా 500ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే ఇది అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వర్తించదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. రూ. 265 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ డేటా 28 రోజులు, రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు1.5 జీబీ 84 రోజులకు అందిస్తుంది. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటాను 84 రోజుల పాటు పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచింది. మినిమమ్ రీఛార్జీని రూ.79 నుంచి రూ.99కి పెంచింది. రూ.149 ప్లాన్‌ను రూ.179కు, రూ.219 ప్లాన్‌ను రూ.265కు, రూ.249 ప్లాన్‌ను రూ.299కు, రూ. 298 ప్లాన్‌ను రూ. 359కు, 399 ప్లాన్‌ను 479కు, 449 ప్లాన్‌ను 549కు, 379 ప్లాన్‌ను రూ.455కు, రూ. 598 ప్లాన్‌ను 719కు, రూ. 698 ప్లాన్‌ను రూ.839కు, రూ.1498 ప్లాన్‌ను రూ.1799కు పెంచింది. అదనపు డేటా ప్రయోజనం ప్రత్యేకంగా రూ. 265, రూ. 299, రూ. 719, మరియు రూ. 839. అయితే రూ. 265 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సాధారణంగా 1GB రోజువారీ డేటాను అందిస్తుంది, రూ. 299, ప్లాన్‌లు రోజుకు 1.5GB డేటాతో వస్తాయి మరియు రూ. 839 ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.
Read Also.. Petrol Diesel Price: అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cWw7fS
0 Response to "Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గూడ్ న్యూస్.. రోజుకు 500 ఎంబీ డేటా ఉచితం.."
Post a Comment