-->
Weekly Horoscope: అక్టోబర్‌ 24 నుంచి 30 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే..

Weekly Horoscope: అక్టోబర్‌ 24 నుంచి 30 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే..

Weekly Horoscope

Weekly Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు తెలిపినదాని ప్రకారం.. అక్టోబర్‌ 24 నుంచి 30వ తేదీ వరకు వివిధ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం.

మేశ రాశి:

ఈ వారంలో ఈ రాశివారు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. విద్యార్థులకు మంచి జరుగుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఎవ్వరికి కూడా హామీలు ఇవ్వకూడదు.

వృషభ రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో మంచి అప్యాయతలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి:

చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు విదేశాల్లో చదువులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి:

ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చదువుల విషయంలో విద్యార్థులు శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహ రాశి:

ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కొంత చికాకు పెట్టిస్తుంది. కోర్టు విషయాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య రాశి:

ఈ రాశివారు ఇంట్లో మాట పట్టింపులు పెరుగకుండా చూసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో మంచి జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులు పడే అకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

వృశ్చిక రాశి:

అనుకోకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కొంత విబేధాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అవసరానికి కావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు రాశి:

ఖర్చులు పెరుగుతాయి. ఉన్న ఆస్తుల్లో కొంత అమ్మే ప్రయత్నం చేస్తారు. పిల్లలకు పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగుల్లో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది. కోర్టు వ్యవహాలు ఉన్నవారికి వాయిదా పడే అవకాశం ఉంది.

మకర రాశి:

కొన్ని అనవసరమైన ఖర్చులు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి సహకారం అందుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తారు. శని ప్రభావం కారణంగా ఒత్తిడి, శ్రమ తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కుంభ రాశి:

ఈ రాశివారికి చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేపట్టే కొన్ని మంచి పనులు సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహకారాలు అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.

మీన రాశి:

ఈ వారంలో ఈ రాశివారికి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమీప బంధువుల్లో అనారోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. క్రమంగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3B8QksF

0 Response to "Weekly Horoscope: అక్టోబర్‌ 24 నుంచి 30 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel