
Viral Video: బాలుడి ప్రతిభకు లిటిల్ మాస్టర్ ఫిదా.. ఫ్యూచర్ షేన్‌వార్న్ అంటోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరూ పడిపోతారంతే

Viral Video: క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. అయితే కొంతమంది మాత్రం ఎంతో గొప్పగా రాణిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంటారు. ఇక గల్లీ క్రికెట్ విషయానికి వస్తే మాత్రం ఆటతో ఆకట్టుకున్న వారిని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. కానీ, తాజాగా ఓ వీడియోలోని బాలుడి ప్రతిభకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పడిపోయాడంటే.. మీరు నమ్మగలరా. ఇంతకీ ఆ పిల్లాడు ఏంచేశాడని ఆలోచిస్తున్నారా. ఇంకెందుకు ఆలస్యం.. అసలు విషయంలోని వెళ్దాం పదండి మరీ..
ఇందులో ఓ బాలుడు తన స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. తన బౌలింగ్‌లో షాట్లు ఆడేందుకు వారికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దాదాపు అందర్నీ ఔట్ చేసి ఆశ్యర్యపరిచాడు. గల్లీ క్రికెటే అయినా, ఆ పిల్లాడి ప్రతిభకు అంతా ముగ్దులవుతున్నారు. తన బౌలింగ్ యాక్షన్ కూడా బాగుంది. పిల్లలే కాదు యువకులు కూడా ఆ బాలుడి బౌలింగ్ ముందు ఓడిపోయారు.
ఈ వీడియో ఎక్కడిదో మాత్రం తెలియదు. సచిన్ టెండూల్కర్‌కు ఎవరో ఫ్రెండ్ ఈ వీడియోను పంపిచారంట. వీడియో చూసిన తరువాత ఆ బాలుడి ప్రతిభకు ఫిదా అయిన లిటిల్ మాస్టర్.. తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘ బ్రిలియంట్.. ఈ చిన్నారికి ఆటపై ఉన్న ప్రేమ, అభిరుచి స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ క్యాప్షన్ అందిచాడు. దీంతో నెటిజన్లు కూడా ఆ పిల్లాడి ప్రతిభకు పడిపోతున్నారు. లైకులు, కామెంట్లతో తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు. ఒకరేమో వచ్చే ఏడాడి ముంబై ఇండియన్స్ టీంలో ఆడతారంటూ ఫన్నీగా కామెంట్ చేయగా, మరొకరు భ్యవిష్యత్ షేన్‌వార్న్ అంటూ కామెంట్లు పంచుకున్నారు.
View this post on Instagram
Also Read: IPL 2021 Final: కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కెప్టెన్ ఔట్.. మోర్గాన్ స్థానంలో సారథిగా ఎవరంటే?
Viral Video: ఒక్క క్యాచ్ కోసం ముగ్గురు.. పట్టేందుకు నానా కష్టాలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్ టీం.. టీ20 ప్రపంచకప్ వార్మప్‌లో ఘోర పరాజయం..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vqmTBf
0 Response to "Viral Video: బాలుడి ప్రతిభకు లిటిల్ మాస్టర్ ఫిదా.. ఫ్యూచర్ షేన్‌వార్న్ అంటోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరూ పడిపోతారంతే"
Post a Comment