-->
Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!

Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!

Chips Pocket

Viral News: టెక్నాలజీ వాడకం పెరిగాక.. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి కదలకుండానే పని పూర్తి చేసేస్తున్నారు. తమకు అవసరమైన పనులన్నీ ఆన్‌లైన్ ద్వారానే చక్కబెడుతున్నారు. ఇంటికి సంబంధించి దాదాపు పనులను అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌తోనే కంప్లీట్ చేస్తున్నారు. ఇంటికి కావాల్సిన సరుకులు మొదలు, పేమెంట్స్ ఇలా ఒక్కటేమిటి.. ప్రతీది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం, ఇంటికి తెప్పించుకోవడం జరిగిపోయింది. అలా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఎల్లవేళలా శ్రేయస్కరం కాదని పలు సందర్భాల్లో నిరూపితమవుతోంది. ఎందుకంటే.. కొన్నిసార్లు కస్టమర్లు ఆర్డర్‌ పెట్టిన వస్తువుకు బదులు వేరొక వస్తువులు డెలివరీ కావటం చూస్తుంటాం.. తాజాగా బ్రిటన్‌లో ఓ వ్యక్తి ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌ ఆర్డర్‌ పెట్టగా అతనికి వచ్చిన పార్శిల్‌ చూసి షాక్ అయ్యాడు. లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో ఫిజిక్స్‌ టీచర్ డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్‌ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్‌ తినాలని ఆ ప్యాకెట్‌ తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప గడ్డ మాత్రమే కనిపించింది. అది చూసి ఆ టీచర్‌ ఖంగుతిన్నాడు. షాక్‌లోంచి తేరుకుని దాన్ని ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.

ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌గా.. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్‌ తెరిచాను. అందులో చిప్స్ కనిపించలేదు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందని తెలిపాడు. దీనిపై సదరు సంస్థ స్పందిస్తూ అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని, ఆ ప్యాకెట్‌ను వారికి అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామంటూ రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Also read:

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..

Andhra Pradesh: మెడికల్ కాలేజీ తెచ్చిన తంటా.. కర్నూలులో ఆ రెండు కుటుంబాల మధ్య పేలుతున్న మాటల తూటాలు..!

Car in Flood Video: వరదలో కొట్టుకుపోతున్న కారును తాడుతో పక్కకు లాగిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pmEp8p

Related Posts

0 Response to "Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel