-->
VIP Tree: వీఐపీ చెట్టు.. 24 గంటలూ రక్షణగా సెక్యూరిటీ గార్డులు.. నిర్వహణ కోసం లక్షల ఖర్చు..

VIP Tree: వీఐపీ చెట్టు.. 24 గంటలూ రక్షణగా సెక్యూరిటీ గార్డులు.. నిర్వహణ కోసం లక్షల ఖర్చు..

Tree

VIP Tree: చెట్టు విలువ ఏంటో తెలిసిన వారు.. చెట్లను అమితంగా ప్రేమిస్తారు. ఎవరైనా చెట్లకు హానీ చేస్తుంటే అస్సలు ఊరుకోరు. దానికి కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. దీనికి చక్కటి ఉదాహరణగా చిప్కో ఉద్యమాన్ని చెప్పుకోవచ్చు. చెట్లు ఉంటేనే భూమిపై జీవి మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే జీవమే అంతమయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. దేశంలో అటవీ శాతం పెంచడానికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. మధ్య ప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో చెట్టుకు సంబంధించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ చెట్టుకు సంబంధించిన వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు. వీవీఐపీ కంటే ఎక్కువగా ఆదరింపబడుతోంది. అవునండీ బాబూ.. ఈ చెట్టుకు రక్షణగా 24 గంటలూ సెక్యూరిటీ గార్డులు ఉంటారు.

అంతేకాదు.. ఒక్క ఆకు రాలినా ఆ రోజు అధికారులకు కంటిమీద నిద్ర కరువే అని చెప్పాలి. ఇంతకీ అదేం చెట్టో చెప్పలేదు కదా?.. అది బోది చెట్టు. చరిత్రలో బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మితమైన సలామత్ కొండపై ఈ బోధి చెట్టును నాటగా.. అది కాస్తా 15 అడుగుల మేరకు పెరిగింది. ఈ చెట్టును రక్షించేందుకు ఐదుగురు భద్రతా సిబ్బంది నిరంతరం అక్కడ కాపలా ఉంటారు. ఇక ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి.. దాని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేకాదు.. దీని మొత్తం నిర్వహణకు ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు అవుతోందట.

అసలు మ్యాటర్ ఏంటంటే.. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ విశ్వవిద్యాలయం కలిగిన సాంచిలోని సలామత్‌పూర్‌ కొండపై ఈ బోధి వృక్షాన్ని నాటారు. దీనిని సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స నాటారు. ఇది బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్టు గనుక.. దీనికి ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టును అంత్యంత పటిష్ట భద్రత నడుమ సంరక్షిస్తున్నారు. 15 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. దీనికి రక్షణగా ఎప్పుడూ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందట. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ప్రస్తుతం కరోనా కావడంతో.. పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

Also read:

Baby snake: పాము గుడ్ల నుంచి పిల్లలు బయటపడటం ఎంత అద్భుతం.!

Viral News: 51 సంవత్సరాల క్రితం పోయిన పర్స్.. తీవ్రంగా శ్రమించి వెతికి పెట్టిన పోలీసులు.. ఓపెన్ చూస్తే షాక్..

Hair Growing: జుట్టు సమస్యలతో సతమతవుతున్నారా?.. అయితే, ఈ 7 ఆహార పదర్థాలను తప్పక తినాల్సిందే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YAr8h0

0 Response to "VIP Tree: వీఐపీ చెట్టు.. 24 గంటలూ రక్షణగా సెక్యూరిటీ గార్డులు.. నిర్వహణ కోసం లక్షల ఖర్చు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel