-->
Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి..

Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి..

Kmm

Telangana News: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలను.. తాను ఉంటానని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 12 ఏళ్ల నుంచి ఆ ఇద్దరు బాలికలకు నరకరం చూపిస్తున్నారు. చిన్నతనంలో ఏం జరుగుతుందో తెలియక ఆ బాధను అనుభవించిన కవల పిల్లలు అయిన ఆ అక్కా చెల్లెల్లు.. ఇప్పుడు అసలు వాస్తవాలను తెలుసుకున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎదురుతిరిగారు. ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఇద్దరు కవల పిల్లలు అయిన అక్కాచెల్లెల్లు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు 12 క్రితం చనిపోగా.. మేనత్త భర్త అయిన మల్ రెడ్డి కృష్ణా రెడ్డి వారికి అండగా ఉంటానంటూ తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో వారి వయసు సుమారు 8 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఆ అక్కాచెల్లెల్లపై కన్నేసిన ఈ కృష్ణా రెడ్డి అనే మృగం అప్పటి నుంచి వారిపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు.

అయితే, ఏం జరుగుతుందో తెలుసుకోలేని పసితనం అప్పుడు వారిది. అందుకే అన్నీ భరిస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు ఓ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. మేనత్త భర్త కృష్ణా రెడ్డి అరాచకానికి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎదురు తిరిగారు. తాను చేసేది తప్పు అని ఎదురు సమాధానం చెప్పిన అక్కాచెల్లెళ్లను తీవ్రంగా కొట్టాడు కృష్ణా రెడ్డి, విషయం బయటకు చెబితే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక లాభం లేదనుకున్న ఆ అక్కాచెల్లెళ్లు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్‌ని ఆశ్రయించారు. తమ కష్టాలకు వివరిస్తూ ఆయనకు లేఖ రాశారు. తమను కాపాడాలంటూ ఎస్పీని వేడుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్పీ.. బాధిత అక్కాచెల్లెళ్లను రక్షించారు. వారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. కృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు.

Also read:

Telangana Crime: ప్రేమ పేరుతో వేధింపులు.. అది తెలిసి యువతి బంధువులు ఏం చేశారంటే..

TDP vs YCP: ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..

Hyderabad Crime: రాజేంద్ర నగర్‌లో మిస్టరీగా బాలుడు మిస్సింగ్ కేసు.. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3E3OxXz

Related Posts

0 Response to "Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel