
Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Telangana News: ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళాంటే అందరికీ హడల్. పెరట్లో పిల్లలు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా.. హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ లేనిదే ఆ ఇంటి వాళ్ళు సైతం పెరట్లోకి వెళ్లలేక పోతున్నారు. అంతగా వారిని భయపెడుతోంది ఓ పిట్ట. ఇంట్లో నుంచి పెరట్లోకి రావడమే ఆలస్యం అటాక్ చేస్తోంది. మరి జనాలను భయపడెతున్న పిట్ట కథ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు..
వివరాల్లోకెళితే.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఉమారాణి వెంకన్న దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ ఇంట్లో వారు తమ పిల్లలతోనే కాదు పిట్టతో కూడా వేగ లేకపోతున్నారు. ఇంటి పెరట్లోని అరటి చెట్టు ఏపుగా పెరిగింది. తాజాగా అరటి గెల కూడా వేసింది. అయితే, రెండు అరటి కాయలు కోయడానికి వెళ్లిన ఉమా రాణి అరటి గెలపై ఉన్న పిట్ట గూడును చూసింది. జాలిపడి ఆ గూడును తీసి వేయకుండా అలాగే ఉంచారు. అయితే, పిట్ట కాస్త దాంట్లో గుడ్లు పెట్టి పొదిగింది. అరటి కాయలు రోజురోజుకీ పెరగటం వల్ల పిట్ట గూడు కింద పడి పోయే అంతగా ఒరిగింది. దాంతో ఉమారాణి తన భర్తను పిలిచి గూడును సరిచేసి కిందపడకుండా పెట్టించింది. ఇది చూసి ఆందోళన చెందిన పిట్ట తన గూడును తీసేస్తారేమోననే ఆందోళనతో పొడవడం ప్రారంభించింది.
అలా వారు పెరట్లోకి వెళ్తే చాలు రెండు పిట్టలు వాళ్ల ఇంటిల్లిపాదిపై దాడి చేస్తున్నాయి. ఎక్కడ కళ్లలో పొడిస్తే.. కళ్ళు పోతాయోననే భయంతో వాళ్లంతా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. పిట్టకు భయపడి హెల్మెట్‌తో తిరగడం ఇరుగు పొరుగువారు చూసి నవ్వుకుంటున్నారు. అయినా పర్వాలేదు అంటున్నారు ఉమారాణి దంపతులు. ఆ పిట్టలు ఎగిరిపోయే వరకు ఈ బాధలు తప్పవని సర్దుకుంటున్నారు. ఆ పిట్టకు తన గూడుపై, గూట్లో ఉన్న పిల్లలపై ప్రేమను చూసి అవి పొడిచినా ఆనందంగా భరిస్తున్నారు ఉమారాణి కుటుంబ సభ్యులు.
Also read:
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..
TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3plXMOF
0 Response to "Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!"
Post a Comment