
SL vs BAN T20 World Cup 2021 Match Prediction: లంకపై బంగ్లా టైగర్స్ గర్జించేనా.. ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

SL vs BAN T20 World Cup 2021 Match Prediction: ఈ టోర్నమెంట్‌లో లంక జట్టు అజేయంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో ఆదివారం, అక్టోబర్ 24న జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ నెం.15లో తలపడనున్నాయి. నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియాలను చాలా సమగ్రమైన రీతిలో ఓడించి, దాసున్ శనక నేతృత్వంలోని లంకవాసులు టోర్నమెంట్‌లో అద్భుత విజయాన్ని సాధించారు.
శుక్రవారం డచ్‌ను 44 పరుగులకే ఆలౌట్ చేసి 7.1 ఓవర్లలో శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు, బంగ్లా టైగర్స్ స్కాట్లాండ్‌పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ, వారు ఒమన్, పాపువా న్యూ గినియాలను ఓడించి సూపర్ 12కి చేరారు. 2007 నుంచి బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక టీంలు టీ20 ప్రపంచ కప్‌లలో ఎప్పుడూ తలపడలేదు.
మ్యాచ్ వివరాలు
మ్యాచ్ – శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ – మ్యాచ్ నంబర్ 15
వేదిక – షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా
సమయం – మధ్యాహ్నం 03:30 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి – స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు.
పిచ్ రిపోర్ట్
షార్జాలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించలేం. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పిచ్‌లో ఛేజింగ్‌కే టాస్ గెలిచిన జట్లు మొగ్గు చూపేంచే అవకాశం ఉంది.
సగటు స్కోరు : 140 (షార్జాలో 15 టీ20లు)
శ్రీలంక
మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్‌లలోని మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు శ్రీలంక వారికి వ్యతిరేకంగా బాగా రాణించటానికి ఇష్టపడతారు.
శ్రీలంక ప్లేయింగ్ XI అంచనా: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ/అకిల దనంజయ, లహిరు కుమార
బంగ్లాదేశ్
Baca Juga
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI అంచనా: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, మహేది హసన్, షకీబ్ అల్ హసన్, నూరుల్ హసన్ (కీపర్), అఫీఫ్ హుస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్
మీకు తెలుసా:
– 2017, 2019 మధ్య ముస్తాఫిజుర్‌కు గాయాల సమస్యలతో సతమతమయ్యాడు. అనంతరం ప్రస్తుతం అతను తిరిగి తన అత్యుత్తమ స్థితికి వచ్చాడు. 2021 లో 55 వికెట్లతో టీ 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తిగా నిలిచాడు.
– 2021లో ముస్తాఫిజుర్ 14 టీ20 లలో 24 వికెట్లు పడగొట్టాడు. 13.70 సగటుతో వికెట్లు పడగొట్టాడు.
– జులై 2019 నుంచి శ్రీలంక టాప్-ఆర్డర్ 19 కంటే తక్కువ సగటు, 110 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తోంది.
స్క్వాడ్‌లు:
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుకా రాజపక్స, దాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమికా కరుణరత్నే, దుశ్మంత చమీర, మహీష్ తీక్షణ, లహిరు కుమార, అకిలా ధనంజయ, బినూర ఫెర్నాండో డి సిల్వా, దినేష్ చండిమాల్
బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (కీపర్), మహ్మద్ సైఫుద్దీన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, షమీమ్ హుస్సేన్, నసుమ్ అహ్మద్ , సౌమ్య సర్కార్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ntnj6i
0 Response to "SL vs BAN T20 World Cup 2021 Match Prediction: లంకపై బంగ్లా టైగర్స్ గర్జించేనా.. ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..?"
Post a Comment