
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దసరా బోనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్..

CM KCR announces bonus to Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు. సింగరేణి కాలరీస్ కార్మికులందరికీ దసరా బోనస్ ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది బోనస్‌కు అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బోనస్‌ను దసరాకు ముందే చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన పేర్కొన్నారు.
సింగరేణిపై మంగళవారం సమీక్ష చేసిన సీఎం కేసీఆర్.. కార్మికులకు బోనస్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇసుక, ఇనుము, సున్నపురాయి తవ్వకాల్లోని సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించాలని కేసీఆర్ సూచించారు. బొగ్గు గని, విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నామంటూ తెలిపారు. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులే కీలక పాత్ర పోషించారని.. వారిదే గొప్ప కృషి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరించడం శోచనీయమంటూ కేసీఆర్ తెలిపారు. విశ్రాంత సిబ్బందికి కేంద్రం నుంచి పింఛన్ రూ.2వేల లోపు వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఎండీకి సూచించారు.
కాగా.. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బోనస్ ప్రకటించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు. సింగరేణి లాభాల్లో 29% వాటాను దసరా కానుకగా కార్మికులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం శ్రీ కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున లాభాల్లో వాటా ఇవ్వడం గర్వకారణం.. అంటూ ట్విట్ చేశారు.
సింగరేణి లాభాల్లో 29% వాటాను దసరా కానుకగా కార్మికులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం శ్రీ కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున లాభాల్లో వాటా ఇవ్వడం గర్వకారణం.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 5, 2021
Also Read:
Money Saving: డబ్బు ఖర్చువుతుందని చింతించకండి..! పొదుపు కోసం ఈ 4 మార్గాలు ఎంచుకోండి..
Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3adcMpk
0 Response to "Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దసరా బోనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్.."
Post a Comment