
Silver Price Today: పండగ సీజన్‌లో వెండి ధరలు పెరుగులు.. తాజాగా పెరిగిన సిల్వర్ రేట్లు..!

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి నిలకడగా ఉంటూ వస్తున్న వెండి ధరలు నిన్నటి నుంచి ఎగబాకుతోంది. భారతీయులు బంగారం, వెండికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పండగ సీజన్‌లో పరుగులు పెడుతోంది. గురువారం (అక్టోబర్ 14)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగగా, హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.62,100 ఉండగా, చెన్నైలో రూ.65,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.62,100 ఉండగా, కోల్‌కతాలో రూ.62,100 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,100 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.65,800 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
ఇవీ కూడా చదవండి:
Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు..!
LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lFkkYy
0 Response to "Silver Price Today: పండగ సీజన్‌లో వెండి ధరలు పెరుగులు.. తాజాగా పెరిగిన సిల్వర్ రేట్లు..!"
Post a Comment