-->
Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..

Bathukamma

సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే. ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. ఎంగిల పూలతో సంబురం మొదలైంది. ఆడపడుచులు తీరొక్క పూలతో వీధివీధిన బతుకమ్మను కొలుస్తున్నారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజు, మరికొన్ని ప్రాంతాల్లో 11రోజులు, 13 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. ఇదిలావుంటే ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడతోపాటు కొండపాకలో ఏడు రోజులపాటు ఆడతారు. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం బుధవారమే సద్దుల పండుగను నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇక హైదరాబాద్‌లో భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఆడపడుచులు. జీహెచ్ఏంసీ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ లోని పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జీహెచ్ ఎంసీ మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆడపడుచులు , మహిళా కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఇక తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకపై హాట్‌ టాపిక్‌ నడిచింది. వాస్తవానికి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది మాత్రం గందరగోళం నెలకొంది. వేద పండితుల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. చివరకు ఈ నెల 13 అంటే ఈరోజు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని ప్రకటించారు.

మరోవైపు రాష్ట్ర సర్కార్ ఈరోజే సద్దుల బతుకమ్మ పండుగ అని ఖరారు చేసింది. తీరొక్కపూలతో ముస్తాబయ్యే బతుకమ్మల సందడి తెలంగాణ అంతటా కనిపించింది. ఈరోజు సద్దుల బతుకమ్మ రేపు నవమి వేడుకలు.. తర్వాతి రోజు విజయదశమి సంబరాలతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి: Prime Minister Narendra Modi: అఫ్గన్లకు తక్షణ ఆపన్న హస్తం అందించాలి.. G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు

Political Story: గాంధీ పేరుతో బతకడం కోసం పాకులాట!

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ACr9OE

0 Response to "Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel