-->
Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు

Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు

Road Accident

దసరా పండుగ అందరికీ ఆనందాన్ని ఇస్తే.. ఆ కుటుంబానికి మాత్రం తీరని శోకాన్ని మిగిల్చింది. బెల్లంపల్లికి చెందిన సంగీత తన ఇద్దరు పిల్లలు అఖిల్, సిద్ధూతో కలిసి.. మంచిర్యాల హమాలివాడలోని అన్న శివకుమార్ ఇంటికి వచ్చింది. పండగ సందర్భంగా అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. పండగ అయిపోవడంతో తిరిగి పుట్టింటికి బయలు దేరింది. చెల్లెను, పిల్లలను తన బైక్‌పై ఎక్కించుకుని.. శివకుమార్ బయలు దేరాడు. కానీ దారి మధ్యలోనే వాళ్లు మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వారిని చావు పలకరించింది.  ఎదురుగా వచ్చిన లారీ.. బలంగా ఢీకొట్టింది. సంగీత, అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివకుమార్, సిద్ధూ పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. డ్రైవర్‌ను పట్టుకుని స్థానికులు చితకబాదారు.

పండగ రోజు.. పుట్టింట్లో ఎంతో సంతోషంగా గడిపారు. కాసేపట్లో అత్తగారింటికి చేరతామగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో తల్లీ, కొడుకు మాంసపు ముద్దలుగా మారారు. వాళ్లు ప్రయాణిస్తున్న బాధిత కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. బైక్ నుజ్జు నుజ్జయింది. దీన్ని బట్టి చూస్తేనే అర్ధమవుతోంది.. ఆ లారీ డ్రైవర్ ఎంత వేగంతో వచ్చి ఢీ కొట్టాడో అని. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: దసరా, ఉప ఎన్నిక ఎఫెక్ట్.. 2 రోజుల్లో మద్యం అమ్మకాలు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lNoQo0

Related Posts

0 Response to "Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel