-->
Rajamouli: ప్రభాస్‌తో పోటీపై స్పందించిన రాజమౌళి.. జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

Rajamouli: ప్రభాస్‌తో పోటీపై స్పందించిన రాజమౌళి.. జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

Rajamouli Prabhas

Rajamouli: కరోనా తదనంతర పరిణామాల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటోంది. థియేటర్లలో సినిమాలు విడదలవుతూ ఇండస్ట్రీలో కొత్త ఊపు వచ్చింది. ఈ క్రమంలోనే బడా చిత్రాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతగానో కలిసి వచ్చే సంక్రాంతికి భారీ బడ్జెట్‌ సినిమాలు రానున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌.ఆర్.ఆర్‌ ఒకటి కాగా, ప్రభాస్‌ హీరోగా వస్తోన్న రాధే శ్యామ్‌ మరొకటి. ఈ రెండు చిత్రాలపై యావత్‌ దేశవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్‌ ఉంది. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నవే, ఈ రెండూ ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కినవే. దీంతో సహజంగానే ఈ రెండు సినిమాలకు మధ్య పోటీ ఉంటుంది.

వారం రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు బడా సినిమాలు విడుదలవుతుండడంతో అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఒక సినిమాకు మరొక సినిమా పోటీనిస్తుందా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. తాజాగా ఈ ప్రశ్నే దర్శకుడు రాజమౌళికి కూడా ఎదురైంది. రాధేశ్యామ్‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌ల మధ్య పోటీ ఉంటుందా.? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన జక్కన్న.. ‘సినిమాల మధ్య పోటీ అనేది గతంలో కూడా ఉంది. సినిమాలు ఎన్ని విడుదలైనా కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. ఇందలో పోటీ అనుకోవడానికి ఏం లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆర్.ఆర్‌.ఆర్‌ సినిమా వచ్చే ఏడాది 7న విడుదలువుతండగా, రాధేశ్యామ్‌ 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Also Read: Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత

Pushpaka Vimanam: అల్లు అర్జున్ వదిలిన ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ట్రైలర్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jOBAte

Related Posts

0 Response to "Rajamouli: ప్రభాస్‌తో పోటీపై స్పందించిన రాజమౌళి.. జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel