
Railway Jobs: కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Railway Jobs: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 139 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, అర్హతలు ఏంటన్న విషయాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 139 ఖాళీలకు గాను డిప్లొమా అప్రెంటిస్ (52), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (87) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* డిప్లొమా అప్రెంటిస్‌లో భాగంగా సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
* అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు గాను సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, మెకానికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 22.11.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Puneeth Rajkumar Death: పునీత్ మరణం పై రామ్ చరణ్ – రోజా ఎమోషనల్ కామెంట్స్..
Supreme Court: బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం.. గ్రీన్ క్రాకర్స్ తయారీకి మాత్రమే అనుమతి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3muDaSN
0 Response to "Railway Jobs: కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.."
Post a Comment