
Pushpa : శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్న శ్రీవల్లి సాంగ్ .. యూట్యూబ్ లో నయా రికార్డ్ ..

Pushpa : నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే..అంటూ సాగే పుష్ప లిరికల్ సాంగ్ విడుదలైంది. అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న శ్రీవల్లి పాట విడుదల చేశారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటకు అనూహ్య స్పందన వస్తుంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అద్భుతంగా ఉన్నారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ పాట తెలుగులో 5 మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. అలాగే ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XfLMms
0 Response to "Pushpa : శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్న శ్రీవల్లి సాంగ్ .. యూట్యూబ్ లో నయా రికార్డ్ .."
Post a Comment