-->
Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..

Vijay Alluarjun

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) అకాల మరణంపై యావత్‌ సినిమా ఇండస్ట్రీ షాక్‌కి గురైన విషయం తెలిసిందే. ఏంతో భవిష్యత్తు ఉన్న హీరో ఇలా చిన్న తనంలో మరణించడంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోను కడసరి చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు బెంగళూరుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఇప్పటికే పునీత్‌ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్య క్రియలను ఆదివారం నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి పట్ల స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ సంతాపం తెలిపారు. శనివారం జరిగిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ విడుదల వేడుకలో అల్లు అర్జున్‌తో పాటు విజయ్‌ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్‌ గురించి బన్నీ మాట్లాడుతూ.. తనకు రాజ్‌కుమార్‌ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయన లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బన్నీ చెప్పుకొచ్చారు. పునీత్‌ సౌత్‌ ఇండియా సినీ పరిశ్రమకు గర్వకారణమని తెలిపారు. ఇక విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం చాలా బాధాకరం. కొన్నాళ్ల క్రితం పునీత్‌ నన్ను తన ఇంటికి ఆహ్వానించార’ని విజయ్‌ చెప్పుకొచ్చారు.

Also Read: IPL 2022: షాకివ్వనున్న బీసీసీఐ కొత్త రూల్స్.. పాటించకుంటే కోత.. ఆటగాళ్ల వేతనాలపైనా క్లారిటీ..!

Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ లైవ్.. చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

SA vs SL Match Result: మిల్లర్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ ఆశలు సజీవం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nHTRtg

Related Posts

0 Response to "Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel