-->
Puneeth Raj Kumar: మొదలైన అప్పు అంతిమ యాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్న పునీత్ అంత్యక్రియలు..

Puneeth Raj Kumar: మొదలైన అప్పు అంతిమ యాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్న పునీత్ అంత్యక్రియలు..

Puneeth Raj Kumar

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర మొదలైంది . ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం అంత్యక్రియలు జరుగుతున్నాయి. కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయం 4.40 కే అంతిమ యాత్ర మొదలయింది. పునీత్ ను కడసారి చూసుకోవడానికి అభిమానులు బారులు దీరారు. కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు . తల్లిదండ్రుల సమాధివద్దనే పునీత్ రాజ్ కుమార్ కు కూడా అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.రాఘవేంద్ర కుమారుడు విన‌య్ చేతుల మీదుగానే పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌కు ఇద్ద‌రు కూతుళ్లు వందిత, ధృతి. కొడుకులు లేనందున పునీత్ త‌ల‌కొరివిని ఆయన అన్న కొడుకు విన‌య్ రాజ్‌కుమార్ పెట్టనున్నాడు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ కు శముగ్గురు కుమారులు. శివన్న, పునీత్, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌. రాఘవేంద్ర కుమారుడు విన‌య్ చేతుల మీదుగానే పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లు జరగనున్నాయి. అయితే వినయ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. వినయ్ హీరోగా ఎదగడానికి బాబాయ్ పునీత్ ఎంతగానో సహాయపడ్డాడు.

పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి దక్షిణాది సినీ పరిశ్రమనే కాదు అభిమానులను కూడా తీవ్ర శోక సంద్రంలో ముంచింది. అమెరికాలో ఉన్న పునీత్ తనయ ధృతి వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించడంతో ఈరోజు పునీత్ అంత్యక్రియలు ప్రభత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించింది. మరోవైపు అభిమానులు పునీత్ ను చివరిసారిగా దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు.

 

Also Read:

పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..

 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZAKhQC

Related Posts

0 Response to "Puneeth Raj Kumar: మొదలైన అప్పు అంతిమ యాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్న పునీత్ అంత్యక్రియలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel