-->
Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్లను జయించే చిట్కాలు..!

Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్లను జయించే చిట్కాలు..!

Psychological Stress

Psychological Stress: ప్రస్తుత కాలంలో అధిక ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అధిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నా.. కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎన్నో రకాల కారణాలు వెంటాడుతూ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఇప్పుడున్న పరిస్థితులను జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

టెన్షన్‌కు మంచి ఆహారం..

అధిక టెన్షన్‌కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. శరీరం మొత్తం యాక్టివ్‌ అవుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.

పదేపదే ఆలోచించవద్దు:

కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒంటరితనం వద్దు..

ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా ఆరోగ్యానికి గురి చేస్తుంది. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి. చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతి లేకుండా పనులు చేయడం, యంత్రాల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి జయించవచ్చు.

ఒత్తిడిని జయించేందుకు కొన్ని చిట్కాలు:

నిద్ర: కంటి నిండా నిద్ర ఉంటే ఆ వ్యక్తులకు ఒత్తిడిని సులువగా జయిస్తారని చెప్పవచ్చు. రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తే మానసిక ప్రశాంతత దొరుకుంది.

మద్యానికి దూరంగా ఉండడం:

చెడు అలవాటు అని తెలిసినా మద్యాన్ని మానేయలేరు. కానీ మద్యం సేవించిన తర్వాత కోపం పెరిగి ఇతరులతో గొడవ పడటం, కోపాన్ని ప్రదర్శించడం చేస్తారు. దీని వల్ల కొన్ని బంధాలు కోల్పోతారు. సాధ్యమైనంతవరకు మద్యం తీసుకోవడం తగ్గించడం మంచిది. మద్యం సేవిండం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి.. వైరస్ బారినపడే అవకాశాలు పెరుగుతాయి.

వ్యాయామం లేదా యోగా:

ప్రతిరోజూ ఉదయం యోగా లేక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45 నిమిషాల పాటు ఈ వ్యాయామలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది.

వదంతులకు దూరంగా ఉండడం:

మీ చుట్టు అది జరిగింది, వాళ్లు ఇలా, వీళ్లు ఇలా చేశారంటూ పొరుగువారు మీతో డిస్కషన్ కు వస్తే అక్కడే ఆపేయండి. వీటి బదులు మీరు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ పనులు సులువుగా పూర్తిచేసే అవకాశాలుంటాయి.

మరికొన్ని మార్గాలు:

* మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్తూ సరైన రీతిలో వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
* టి‌విలలో మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు చూడడం మంచిది. భయాందోళనకు గురిచేసే సినిమాలు, ప్రోగ్రామ్స్ చూడవద్దు. వీలైతే ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
* ఆహ్లాదానిచ్చే సినిమాలు చూడడం, ఇంట్లోనే ఉంటూ బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదవుతూ ఉండాలి.

* వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.
* మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.

ఇవీ కూడా చదవండి:

Eye Reveals: గుండె పనితీరును కంటి పరీక్షతో తెలుసుకోవచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి

Jackfruit Benefits: పనస పండు వల్ల అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఆ విషయంలో మాత్రం కీలక పాత్ర..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Dh14qc

Related Posts

0 Response to "Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్లను జయించే చిట్కాలు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel