
Pooja Hegde : బుట్టబొమ్మ సంపాదన భారీగా నే ఉందే.. పూజాహెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Pooja Hegde : టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్.. ఇలా మూడు వుడ్‌లను తన అందంతో, నటనతో కట్టిపడేస్తుంది బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఒకలైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. ఆతర్వాత వరుస సినిమాతో తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ చిన్నది. అటు హిందీలోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో పూజ నటించింది. ఇక ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. దళపతి విజయ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ సుందరి. ఇక తెలుగులో అఖిల్‌కు జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అలాగే డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఈ చిన్నది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. మరో వైపు పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమాలోనూ పూజా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజ హెగ్డే అసలు ఎంత సంపాదిస్తుంది అన్న టాపిక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నెలసరి ఆదాయం అంతా.. ఇంతా.. అంటూ ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క సినిమాకు పూజ 3నుంచి 4 కోట్లు వరకు వసూల్ చేస్తుంది టాక్. ఈ క్రమంలో ఇప్పటివరకు పూజాహెగ్దే సంపాదన మొత్తం 50-70 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. అటు యాడ్స్‌లోనూ నటిస్తూ సంపాదిస్తుంది ఈ చిన్నది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..
Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)
Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AXXIal
0 Response to "Pooja Hegde : బుట్టబొమ్మ సంపాదన భారీగా నే ఉందే.. పూజాహెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.."
Post a Comment