
Police Dogs: పదవీ విరమణ పొందిన పోలీసు జాగిలాలు.. వీడ్కోలు వేడుక మామూలుగా లేదు..

Police Dogs: అది జిల్లా పోలీసు కార్యాలయం అవరణం. ఇవాళ అక్కడ ఎటు చూసినా పోలీసు అధికారులు, సిబ్బంది ఫుల్ హడావిడి ఉంది. ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. ఎవరో పోలీసు అధికారులు పదవి విరమణ చేస్తున్నారని అనేలా ఉంది. అయితే అక్కడ పదవీ విరమణ చేస్తున్న మాట వాస్తవమే.. కానీ పోలీసు అధికారులు, సిబ్బంది మాత్రం కాదు. ఇంతకీ పదవీ విరమణ చేస్తున్నది ఎవరా? అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నాం. పోలీసు జాగీలాలు.. అవును మీరు వింటున్నది నిజమే మరి. పోలీసుల జాగిలాలు పదవీ విరమణ పొందుతున్నాయి.
వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో పదేళ్ల పాటు సేవలు అందించిన సింధు, లక్కీ అనే రెండు జాగీలాలు జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ చేశాయి. పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకి ఎలా అయితే సన్మానం చేసి వీడ్కోలు పలుకుతారో అచ్చం అలానే వీడ్కోలు పలికారు అధికారులు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఈ పోలీసు జాగీలాలకు సన్మానం చేశారు. జిల్లాలో క్లూస్ దొరకని ఎన్నో కేసుల్లో ఈ జాగీలాల ద్వారా క్లూస్ సాధించి కేసులను పరిష్కరించారని జిల్లా ఎస్పీ విజయా రావు తెలిపారు. వాటి సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు. రిటైర్ అవుతున్న పోలీసు జాగీలాలకు శాలువా కప్పి పూల మాలలతో ఘనంగా సన్మానించారు పోలీసుల అధికారులు.
Also read:
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా..! అయితే కొవ్వు కరిగిస్తున్నారా లేదా కండరాలు కోల్పోతున్నారా..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iu5QJ3
0 Response to "Police Dogs: పదవీ విరమణ పొందిన పోలీసు జాగిలాలు.. వీడ్కోలు వేడుక మామూలుగా లేదు.."
Post a Comment