-->
pm kisan: ఈ రైతుల ఖాతాలో రూ.6000 ప‌డ‌టం లేదు.. అస‌లు వీరు చేసిన త‌ప్పేంటో తెలుసా..?

pm kisan: ఈ రైతుల ఖాతాలో రూ.6000 ప‌డ‌టం లేదు.. అస‌లు వీరు చేసిన త‌ప్పేంటో తెలుసా..?

Pm Kisan

pm kisan: ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి పథకం కింద, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి నవంబర్ వరకు 10,40,28,677 మంది రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయ‌ల‌ను జ‌మ చేసింది. తాజాగా 10 వ విడత డ‌బ్బులు పంపిణీ చేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ డ‌బ్బులు రైతుల ఖాతాల్లో డిసెంబ‌ర్ 10, 15 తేదీల మధ్య జ‌మ అవుతాయి. అయితే 7,24,042 మంది రైతులకు డ‌బ్బులు అంద‌లేదు. వారి అకౌంట్లో డ‌బ్బులు జ‌మ‌కాలేదు. 49,76,579 మంది రైతుల ఖాతాలు పెండింగ్ ఉన్న‌ట్లు చూపిస్తున్నాయి. దరఖాస్తు చేసినా ఈ రైతుల‌కు డబ్బులు జ‌మ కావ‌డం లేదు. ఎందుకంటే దీనికి కార‌ణాలు ఇలా ఉన్నాయి.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు PM కిసాన్ ప్రయోజనాన్ని పొందడానికి, ఫారమ్ నింపేటప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అంతేకాదు సరైన పత్రాలను కలిగి ఉండాల‌ని సూచించారు. లేదంటే దరఖాస్తు చేసిన తర్వాత కూడా డబ్బులు రావ‌ని తెలిపారు. ఒక చిన్న పొరపాటు వ‌ల్ల మీరు 2వేల రూపాయ‌ల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమై 33 నెలలు అయ్యింది. డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల మంది లబ్ధిదారులు ఈ ప‌థ‌కంలో చేరారు. రూ.1.58 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జ‌మ చేస్తున్నారు. కానీ దరఖాస్తు చేసినప్పటికీ డబ్బులు పొందని రైతులు కొంత‌మంది ఉన్నారు. వీరు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించలేదు.

వీటిని గుర్తుంచుకోండి
పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు, ఫారమ్‌ను పూర్తిగా చ‌దివి స‌రైన సమాచారం అందించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో ఎవరి రికార్డునైనా క్రాస్ చెక్ చేసే అవ‌కాశం ఉంది. త‌ప్పుగా తేలితే డ‌బ్బులు నిలిపివేస్తారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా సమాచారం నింపేట‌ప్పుడు IFSC కోడ్‌ని సరిగ్గా రాయాలి. ప్రస్తుత అకౌంట్ యాక్టివేట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. భూమి వివరాలు ముఖ్యంగా ఖస్రా నంబర్‌, ఖాతా సంఖ్య చాలా జాగ్రత్తగా నింపాలి.

రైతులు చేస్తున్న త‌ప్పులు

1. ఖాతా యాక్టివేట్‌గా ఉండ‌టం లేదు. హోల్డ్‌లో ఉంటుంది.
2 . వీరు ఇచ్చిన అకౌంట్ బ్యాంకులో ఉండ‌టం లేదు. దీని అర్థం ఖాతా నంబర్ త‌ప్పుగా ఉంటుంది.

3. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా రైతు రికార్డు ఆమోదించలేదు.
4. బ్యాంక్ తిరస్కరించిన ఖాతా అంటే ఖాతా మూసివేసార‌ని అర్థం.
5. PFMS/ ద్వారా రైతు భూ రికార్డును తిరస్కర‌న‌కు గురైంది.
6. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగలేదు.
7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క‌ర‌క్ష‌న్ పెండింగ్‌లో ఉంది.

Lakhimpur Kheri clash: ‘నా కొడుకు కారులో లేడు.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు’ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Yexlj3

Related Posts

0 Response to "pm kisan: ఈ రైతుల ఖాతాలో రూ.6000 ప‌డ‌టం లేదు.. అస‌లు వీరు చేసిన త‌ప్పేంటో తెలుసా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel