-->
Online Money Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోయారా?.. అయితే ఇలా చేయండి.. మీ డబ్బు వెనక్కి పొందండి..!

Online Money Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోయారా?.. అయితే ఇలా చేయండి.. మీ డబ్బు వెనక్కి పొందండి..!

Money

Online Money Fraud: బ్యాంకింగ్ రంగంలో ఏ రేంజ్‌లో మార్పులు వచ్చాయో తెలిసిందే. బ్యాంకుల వద్ద క్యూలు నిల్చునే రోజులు పోయి.. సెకన్ల వ్యవధిలో పనులు చక్కబెట్టే పరిస్థితులు వచ్చాయి. అంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చాలా సులువైపోయింది. అయితే, ఈ టెక్నాలజీయే కొందరి కొంప కొల్లేరు చేస్తుంది. టెక్నాలజీ జనాలకు ఎంత ఉపయోగపడుతుందో.. అంతే స్థాయిలో నష్టం కూడా చేకూరుస్తుంది. మోసగాళ్లు టెక్నాలజీలోని లొసుగులను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ లావాదేవీల్లో భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ వినియోగదారుల అకౌంట్ వివరాలను తెలుసుకుని.. ఖాతాలోని డబ్బునంతా కాజేస్తున్నారు. అయితే, ఒకసారి ఇలా సైబర్ నేరగాళ్ల వల్ల కోల్పోయిన డబ్బు రికరీ చేసుకోవడం కష్టంతో కూడిన పని అనే చెప్పాలి. ఎందుకంటే, పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడం, ఎంక్వైరీలు, నిందితులను పట్టుకుని వారి నుంచి రికవరీ చేయడం, ఎంత రికవరీ అవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. వస్తే వస్తాయి.. లేదంటే పోతాయి అన్నట్లు ఉంటుంది పరిస్థితి.

అయితే, ఒక పని చేయడం ద్వారా ఆన్‌లైన్ చీటింగ్‌లో కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇతరలకు తెలిసినట్టు అనుమానం వచ్చినా, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాంటివి పోగొట్టుకున్నా వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. బ్యాంకులు మాత్రమే కాదు, పేమెంట్స్ యాప్స్ సేవలు పొందుతున్నా మీ అకౌంట్ వివరాలు లీక్ అయినట్టైతే వెంటనే సంబంధిత సమాచారాన్ని బ్యాంకులకు, పేమెంట్స్ బ్యాంకులకు ఇవ్వాలి. అలా చేయడం ద్వారా.. బ్యాంకులు వాటిని బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. మీ అకౌంట్ నుంచి లావాదేవీలు జరగకుండా చూసుకుంటాయి.

అయితే, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలు చోరీ అయినట్లు బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా మీ అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగినట్లయితే.. మీ పోయిన డబ్బుకు మీకు సంబంధం లేదు. మీ అకౌంట్ నుంచి ఎంత డబ్బు పోతే.. అంత డబ్బును బ్యాంకులు మీకు తిరిగి ఇస్తుంది. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్ కూడా ఉంది. సరైన సమయంలో బ్యాంకుకు సమాచారం ఇస్తేనే ఇది వర్తిస్తుంది. లేదంటే.. ఇది వర్తించదు. మీరు సమాచారం ఇచ్చిన తర్వాత అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగితే బ్యాంకు మీకు 10 రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ లావాదేవీలు జరిగిన మూడు రోజులకు మీరు సమాచారం ఇచ్చినట్టైతే మీకు గరిష్టంగా రూ.25,000 వరకే డబ్బు వెనక్కి వస్తుంది. ఇదిలాఉంటే.. లావాదేవీల విషయంలో చాలాజాగ్రత్తగా ఉండండి. మీ బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇతరులకు షేర్ చేసుకోకండి. ఏమాత్రం పొరపాటు జరిగినా.. జేబులు కల్లాస్ అవడం ఖాయం అయ్యింది.

Also read:

Baby-Born: అప్పుడే పుట్టిన శిశువును చూసిన డార్టర్లు షాక్.. ఎందుకంటే..

Cryptocurrency: పెరుగుతున్న బిట్‌కాయిన్ .. డౌన్ రేసులో ఈథర్, కార్డనో..

Samantha: సమంత పరువునష్టం దావా కేసులో వాదనలు వినిపించిన లాయర్‌.. సమంత ఎక్కడా డబ్బు ఆడగలేదని..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pBCvRe

Related Posts

0 Response to "Online Money Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోయారా?.. అయితే ఇలా చేయండి.. మీ డబ్బు వెనక్కి పొందండి..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel