
Ola Car Offer: మీరు కారు కొనాలనుకుంటున్నారా..? కస్టమర్లకు ‘ఓలా’ అదిరిపోయే ఆఫర్.. లక్ష వరకు తగ్గింపు..!

Ola Car Offer: ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముందే దీపావళీ పండగ సీజన్‌లో వివిధ వాహనాల కంపెనీలు కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇక ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ ఓన్డ్ (పాత) కార్లపై రూ.1లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఓలాఎలక్ట్రిక్ బైక్‌తో రికార్డ్‌లను సృష్టిస్తున్న ఓలా కంపెనీ.. కార్ల ప్లాట్ ఫామ్‌లో రికార్డు మరింత సృష్టించేందుకు సరికొత్త బిజినెస్ మోడల్‌ను విడుదల చేసింది.
ఈ దీపావళి సందర్భంగా ఓలా ప్రీ ఓన్డ్ ఫెస్టివల్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఓలా సంస్థ 2 వేల కొత్త కార్లు, పాత కార్లను అమ్మకాలకు పెట్టింది. ఈ సేల్‌లో భాగంగా పాత కార్లను కొనుగోలు చేస్తే..ఆ కారుపై లక్ష వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు రెండు సంవత్సరాల వరకు ఉచిత సర్వీసింగ్,12 నెలల వారంటీ, 7రోజుల రిటర్న్ పాలసీని అమలు చేయనుంది.
ఈ సందర్భంగా ఓలా కార్స్ సీఈవో అరుణ్ సిర్దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలోపు ఓలా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 100 పాత కార్లను అమ్మేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతేకాదు ఓలా యాప్ ద్వారా కొత్త, పాత కార్లను అమ్మడంతో పాటు కస్టమర్లకు పలు సర్వీసులను అందించనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు, వాహన ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, వెహికల్ కండీషన్, పనితీరు, నిర్వహణను పరిశీలించిన తర్వాతనే వినియోగదారులకు కార్లను అమ్మనున్నట్లు తెలిపారు.
కాగా, ఇప్పటికే దీపావళి సందర్భంగా ప్రముఖ కార్ల కంపెనీలు కూడా వాహనదారులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. కొత్త కారు కొనుగోలు చేసేవారికి భారీ తగింపు, ఇతర బెనిఫిట్స్‌ను ప్రకటించాయి. పండగ సీజన్‌లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఇవి కూడా చదవండి:
Tesla Car: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రోడ్డుపై చక్కర్లు కొడుతున్న టెస్లా ఎలక్ట్రిక్ కారు.. మార్కెట్లో సందడి చేయనున్న వాహనాలు
Dhanteras 2021: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. మొబైల్స్, స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jW9hcd
0 Response to "Ola Car Offer: మీరు కారు కొనాలనుకుంటున్నారా..? కస్టమర్లకు ‘ఓలా’ అదిరిపోయే ఆఫర్.. లక్ష వరకు తగ్గింపు..!"
Post a Comment