
Mullaperiyar Dam: ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందామని కేరళ సీఎంకు.. స్టాలిన్ లేఖ

Mullaperiyar Dam: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముల్లైపెరియారు డ్యామ్ కేంద్రంగా జలవివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఆనకట్ట.. సుదీర్ఘ చరిత్రతో పాటు ఈ రెండు రాష్ట్రాల వివాదాలకు కేంద్రంగా నిలిచింది. నీటి మట్టం ఎత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేరళ ప్రజలు నిరసన తెలుపుతుండగా.. ఇటు తమిళనాడులోని అన్నదాతలు కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు.
ముళ్లై పెరియార్ డ్యామ్ నీటి విడుదల విషయం లో ఇరు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి విభేదాలు వద్దని స్టాలిన్ చెప్పారు. ఇరురాష్ట్రాల ప్రజల, నీటి అవసరాలను భవిష్యత్తుని , భద్రతని కాపాడటానికి తాము ఎప్పుడు ముందుంటామని పేర్కొన్నారు. అంతేకాదు కేరళ లో భారీ వర్షాలకు నష్టపోయిన సరిహద్దు జిల్లాలో సహాయక చర్యలకు తమిళనాడు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు సీఎం స్టాలిన్.
Also Read:
గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
పసిడి బాటలో వెండి ధరలు.. భారీగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vZypnm
0 Response to "Mullaperiyar Dam: ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందామని కేరళ సీఎంకు.. స్టాలిన్ లేఖ"
Post a Comment