
Madhura Wines: ‘మనుషులు చేసే తప్పులకు మందును బ్యాడ్ చేయకండి’.. ఆకట్టుకుంటున్న ‘మధుర వైన్స్’ ట్రైలర్ ..

Madhura Wines: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం మధుర వైన్స్. గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. 1.48 నిమిషాల నిడివి ఉన్న టైలర్ ఆసక్తికరంగా సాగింది. అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్లో రకుల్ ప్రీత్ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DFsdTW
0 Response to "Madhura Wines: ‘మనుషులు చేసే తప్పులకు మందును బ్యాడ్ చేయకండి’.. ఆకట్టుకుంటున్న ‘మధుర వైన్స్’ ట్రైలర్ .."
Post a Comment