-->
MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ రాజీనామా.. అన్నిటికి సమాధానం చెప్తానన్న నాగబాబు..

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ రాజీనామా.. అన్నిటికి సమాధానం చెప్తానన్న నాగబాబు..

Nagbabu

MAA elections 2021: మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం..అదంతా ఇప్పుడు ముగిసింది. మా ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయాన్ని సొంతంచేసుకున్నారు. మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్  274 ఓట్లు సంపాదించారు. ఈ హోరాహోరీ పోరులో విష్ణు 103 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలిచారు. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత తొలి పరిణామం చుతూ చేసుకుంది.

మా సభ్యత్వానికి నటుడు, మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి నాగబాబు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ వచ్చారు.. అతడు జాతీయస్థాయి నటుడు అంటూ.. కింది నుంచి పైకి వచ్చాడు అంటూ ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు. అలాగే నేడు సాయంత్రం 7 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తానని ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ తనని అడగాలని కోరారు నాగబాబు. మరి అభిమానులు, ప్రేక్షకుల అడిగే ప్రశ్నలకు నాగబాబు ఎలాంటి సమాదానాలు చెప్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..

MAA Elections Winners: మంచుకే ‘మా’ పీఠం… ఉత్కంఠ పోరులో విష్ణు విజయం…



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oUxR0B

Related Posts

0 Response to "MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ రాజీనామా.. అన్నిటికి సమాధానం చెప్తానన్న నాగబాబు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel