
LIC Jeevan Labh Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.233 డిపాజిట్ చేస్తే చేతికి రూ.17 లక్షలు..!

LIC Jeevan Labh Policy: ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో పెద్దగా పట్టించుకోని వారు ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీమా పాలసీలు చేసుకుంటున్నారు. అందుకు తగినట్లుగానే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బీమా సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేలా పాలసీలను రూపొందిస్తున్నాయి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ఇలాంటి పాలసీలు అందిస్తోంది. ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఈ పాలసీలో ప్రతి నెల రూ.233 డిపాజిట్ చేయడం ద్వారా మొత్తం రూ.17 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ లాభం, రక్షణ రెండింటిని అందిస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు.పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు.
ఉదాహరణకు 23 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి 16 ఏళ్ల కాల పరిమితితో ఆ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకున్నారు. పదేళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. నెలకు దాదాపు రూ.7 వేలు ప్రీమియం కట్టాలి. రోజుకు రూ.233 ఆదా చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.17 లక్షలకు పైగా వస్తాయి.
రుణ సదుపాయం..
ఈ పాలసీ తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా రుణ సదుపాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, బోనస్ వంటివి పొందవచ్చు. ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారుడి మరణంపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీ కొనసాగుతున్న సమయంలో గానీ, ఒక వేళ ప్రీమియంలు పూర్తిగా చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణించినా అతని నామినీ డెత్ సమ్ అస్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనష్, డెత్ బెనిఫిట్స్ అదనంగా బోనస్ అందుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే పాలసీదారుడు మరణించినా అదపు బీమా మొత్తం అందుతుంది. పిల్లల పెళ్లి, ఉన్నత చదువులు, ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటికి ఈ పాలసీ అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి:
High Speed Internet: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ షాక్.. డిసెంబర్ నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్.. ఏ కంపెనీ అంటే..!
PF UAN Number: ఈపీఎఫ్‌ఓ యూఏఎన్ (UAN) నెంబర్ మర్చిపోయారా..? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Bd57Du
0 Response to "LIC Jeevan Labh Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.233 డిపాజిట్ చేస్తే చేతికి రూ.17 లక్షలు..!"
Post a Comment