
Kajal Aggarwal: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న టాలీవుడ్ చందమామ.. సమంత, పూజాహెగ్డేలను వెనక్కి నెట్టి మరీ..

Kajal Aggarwal: 2007లో తెలుగులో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది అందాల తార కాజల్ అగర్వాల్. ‘చందమామ’ సినిమాలో తన అందంతో తెలుగు కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ మగధీర సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని కాజల్ వరుస ఆఫర్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 14 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ చిన్నది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది 2020లో స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు ఓకే చెబుతూ తనలో స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదని చాటి చెప్పింది.
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే కాజల్ తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే కాజల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరతీమైన ఫాలోయింగ్ ఉంది. కాజల్ అగర్వాల్ ఇన్‌స్టా్గ్రామ్ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 20 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ల తన ఫాలోవర్ల ఫోటోలతో రూపొందించిన ఓ వీడియోను పోస్ట్ చేసిన కాజల్.. ‘ఎప్పుడూ నా వెన్నంట ఉండి, నాకెంతో నమ్మకమైన 20 మిలియన్ల సభ్యులున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చింది.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఈ ఫాలోవర్ల సంఖ్యతో కాజల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సమంత, పూజా హెగ్డే వంటి నటీమణులను వెనక్కి నెట్టి మరీ కాజల్ ఫాలోవర్ల సంఖ్యలో 20 మిలియన్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
Also Read: T20 World Cup 2022: సెమీస్ చేరే జట్లు ఇవే.. ! దిగ్గజాలకు షాకిచ్చిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
Maoist Bandh Call: ములుగు ఎన్‌కౌంటర్ బూటకం.. 27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ntrcYH
0 Response to "Kajal Aggarwal: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న టాలీవుడ్ చందమామ.. సమంత, పూజాహెగ్డేలను వెనక్కి నెట్టి మరీ.."
Post a Comment