Indication of body moles: మీ శరీరంపై ఈ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోండి..!

Indication of body moles: ఒకరి శరీరంపై పుట్టుమచ్చను కనుగొనడం చాలా ఈజీనే. కానీ ఆ పుట్టుమచ్చ వెనుక ఉన్న రహస్యం కనిపెట్టడం కష్టం. కానీ ప్రతీ పుట్టుమచ్చ వెనుక ఒక రహస్యం ఉంటుంద. వేద గ్రంధాల ప్రకారం.. పుట్టుమచ్చలు శుభ, అశుభాలకు సంకేతాలుగా గుర్తించవచ్చు. ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి శరీరంలో ఎక్కడో చోట పుట్టుమచ్చ ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలలో కనిపించే ఈ పుట్టుమచ్చలు మీ అందానికి మాత్రమే కాకుండా అదృష్టానికి కూడా సంబంధించినవి. ముఖం, చేతులు, పాదాలు, ఛాతీ, పెదవులు మొదలైన వాటిపై కనిపించే పుట్టుమచ్చ ద్వారా వ్యక్తుల గుణగణాలు, లోపాలు సహా అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే, ఒక పుట్టుమచ్చ పురుషుడికి అదృష్టంగా ఉంటే, అదే పుట్టుమచ్చ స్త్రీకి దురదృష్టకరం కూడా అవుతుంది. మరి పుట్టుమచ్చల ప్రత్యేక ఏంటి? ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నుదిటిపై పుట్టుమచ్చ..
నుదిటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా సరళమైన వ్యక్తి అని నమ్ముతారు. నుదిటి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు, ధనవంతులు. అయితే నుదుటి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి విపరీత చెడు అలవాట్లు ఉంటాయి.
పెదవులపై పుట్టుమచ్చ..
సముద్ర శాస్త్రం ప్రకారం.. పెదవుల పై భాగంలో కుడి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వారు తమకు కావలసిన జీవిత భాగస్వామిని పొందుతారు. పెదవి ఎడమ వైపు ఎగువ భాగంలో ఉన్న పుట్టుమచ్చ మంచిది కాదు. అలాంటి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల వైవాహిక జీవితంలో సామరస్యం లోపిస్తుంది.
నుదురుపై పుట్టుమచ్చ..
నుదురుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు, వారు తరచూ ఏదో ఒక ప్రయాణంలో ఉంటారు. కనుబొమ్మకు కుడి వైపున ఉన్న పుట్టుమచ్చ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంట.. వైవాహిక జీవితంలో సంతోషం తగ్గుతుందని సూచిస్తుంది.
ఛాతీపై పుట్టుమచ్చ..
సముద్ర శాస్త్రం ప్రకారం.. ఛాతీకి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు, వారు చాలా సహనంతో, నిగ్రహంతో ఉంటారు. వీరి వివాహం ఆలస్యంగా జరుగుతుంది. ఛాతీకి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి ధనవంతుడు, ఒక అందమైన జీవిత భాగస్వామిని పొందుతారు.
అరికాలిలో పుట్టుమచ్చ..
సముద్ర శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తికి కుడి కాలు మీద పుట్టుమచ్చ ఉంటే, అతను చాలా ప్రయాణం చేస్తాడు. అయితే ఎడమ కాలు మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా ఖరీదైనవాడు. అదేవిధంగా, కుడి మడమలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి అదృష్టవంతులు, వారు దేశ, విదేశాలలో చాలా పర్యటిస్తారు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రచురించడం జరిగింది.)
Also read:
Viral Video: గజదొంగ ఈ డాగ్.. కాపలా ఉంటుందని ఇంట్లో ఉంచిపోతే యజమానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..!
Healthy Relationship: మీ పిల్లలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి 5 కీలక మార్గాలు.. అవేంటంటే..
Astro Remedies of Salt: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ అదృష్టాన్ని పెంచుతుంది.. అదెలాగో మీకు తెలుసా?..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3G15KTu


0 Response to "Indication of body moles: మీ శరీరంపై ఈ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోండి..!"
Post a Comment