
Hyderabad Rains: హైదరాబాద్ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు మూడు గంటలు ఏకధాటిగా కుండపోత కురిపించింది. దీంతో రాజధాని వీధులు జలాశయాలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పలు రోడ్లపై ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా,రామ్‌నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. వర్షానికి తడిసి వాహనాలు మొరాయించడంతో మరికొందరు వాటిని తోసుకుంటూ వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు.
చింతల కుంట వద్ద గల్లంతైన వ్యక్తి సురక్షితం..
చంపాపేటలో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్ పడిపోయినట్లు సమాచారం. బైక్‌పై వస్తూ నాలా దాటుతుండగా కింద పడిపోగా స్థానికులు రక్షించారు. ఇదిలా ఉంటే చింతల కుంట వద్ద నాలాలో కర్మన్‌ఘాట్‌కు చెందిన జగదీశ్ పడిపోగా గమనించిన స్థానికులు కాపాడారు. ప్రస్తుతం జగదీశ్ సురక్షితంగా ఉన్నట్టు అతని సోదరుడు తెలిపారు. లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు, కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
SRH vs MI: దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్‌పై ఘన విజయం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mFNs1j
0 Response to "Hyderabad Rains: హైదరాబాద్ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం.."
Post a Comment