
Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్ పేరుతో నాలుగు నామినేషన్లు..

హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన నిన్న 46మంది నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి. ఇక 11న నామినేషన్ల పరిశీలన..13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. హుజూరాబాద్‌లో రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరపున బరిలో ఈటల రాజేందర్ బరిలో ఉండగా.. చివరి రోజున రాజేందర్ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరంతోనే ప్రారంభమైంది. ఇమ్మడి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్ తమ నామినేషన్లు వేశారు. అయితే ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్ ఇలాంటి నామినేషన్స్ వేయించిందని ఆరోపిస్తోంది బీజేపీ.
ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్ బైపోల్ ఫైట్‌లో ఉండగా..43మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్ వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియబుల్ ఇన్ స్ర్టుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.
హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్..
ఇదిలావుంటే.. హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్ ఇంటర్ విద్యార్థుల మీద పడింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లుగా పేర్కొంది. అక్టోబర్ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
ఇవి కూడా చదవండి: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iK7UwS
0 Response to "Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్ పేరుతో నాలుగు నామినేషన్లు.."
Post a Comment