-->
Huzurabad By Election: నవంబర్‌ 2న విజయోత్సవం జరుపుకుందాం.. హుజూరాబాద్ ఎన్నికలపై హరీష్ రావు.

Huzurabad By Election: నవంబర్‌ 2న విజయోత్సవం జరుపుకుందాం.. హుజూరాబాద్ ఎన్నికలపై హరీష్ రావు.

Harish Rao

Huzurabad By Election: హుజూరాబాద్‌ ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 86 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. దీంతో విజయంపై అటు టీఆర్‌ఎస్‌తో పాటు ఇటు బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్‌ తమకు హెల్ప్‌ అవుతందంటే.. తమకు అవుతుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారాన్ని హరీష్‌ రావు ఒంటి చేత్తో నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా గ్రామగ్రామాన ప్రచారం చేశారు. ఇక తాజాగా ఎన్నికలు పూర్తయిన తర్వాత హరీష్‌ రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకోసం పనిచేసిన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడిన హరీష్‌.. ‘గత 4  నెలల నుంచి హుజూరాబాద్‌ విద్యార్థి యువ మిత్రులు, సోషల్‌ మీడియా మిత్రులు చాలా కష్టపడి పనిచేశారు. ఎంతో శ్రమకోర్చి మీ విలువైన సమయాన్ని పార్టీ కోసం కేటాయించి నాతో పాటు పని చేసిన మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. మనం మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. మళ్లీ నవంబర్‌ 2 కౌంటింగ్‌ తర్వాత తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటాను. పార్టీ విజయంకోసం చాలా కష్టపడి పని చేశారు. కొంచెం విశ్రాంతి తీసుకోండి మళ్లీ కౌంటింగ్‌ తర్వాత కలుసుకొని విజయోత్సవం జరుపుకుందాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా ఎగ్జిట్‌ పోల్స్‌ సందడి కూడా మొదలైంది. ఒక్కో ఎగ్జిట్‌ పోల్‌ ఒక్కో రకమైన తీర్పు రానున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు సామాన్య ప్రజల వరకు ఉంది. ఓటర్‌లు హుజూరాబాద్‌లో ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే నవంబర్‌ 2 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Puneeth Rajkumar : ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ..

SA vs SL Match Result: మిల్లర్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ ఆశలు సజీవం

Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bsx5jb

Related Posts

0 Response to "Huzurabad By Election: నవంబర్‌ 2న విజయోత్సవం జరుపుకుందాం.. హుజూరాబాద్ ఎన్నికలపై హరీష్ రావు."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel