-->
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు జోరుగా పెరుగుతాయి. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

నిన్న పెరిగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా గురువారం (అక్టోబర్‌ 7) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో గురువారం ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700 ఉంది.

అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,560 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3murs9w

0 Response to "Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel