-->
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price Today

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా కొనసాగుతోంది. తులం బంగారంపై రూ.100 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460గా ఉంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,600గా ఉంది.

Also Read:

Chandrababu Naidu: పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Kesineni Nani: అలక వీడిన కేశినేని నాని.. చంద్రబాబు దీక్షకు మద్దతు.. చాలా రోజుల తర్వాత ప్రత్యేక భేటీ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GdinuH

Related Posts

0 Response to "Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel