
Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

Gold Price Today: దసరా, దీపావళి, ధంతేరస్ ఇలా పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక తాజాగా శనివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.980 వరకు పెరిగింది. ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో శనివారం ధరల వివరాలు:
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910 ఉంది.
► ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350 ఉంది.
పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇవీ కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..
ATM: ఇక నుంచి ఏటీఎంలలో డబ్బుల కొరత ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి అమలు..!
SBI Loans: ఎస్‌బీఐ కీలక నిర్ణయం. వాటితో భాగస్వామ్యం.. గ్రామీణ ప్రాంతాల వారికి సులభమైన రుణాలు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39YC0HW
0 Response to "Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!"
Post a Comment