-->
First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

First Election In Independent India

First Election in India: మనకు 15 ఆగష్టు 1947 న స్వాతంత్ర్యం లభించింది. అలాగే భారతదేశం 26 జనవరి 1950 న రిపబ్లిక్‌గా అవతరించింది. ఈ విషయాలు మనకు తెలిసినవే. రిపబ్లిక్ గా అవతరించిన తరువాత మన దేశంలో ఎప్పుడు.. ఏవిధంగా  ఎన్నికలు నిర్వహించారో ఎక్కువ మందికి గుర్తు ఉండి ఉండకపోవచ్చు. రిపబ్లిక్ గా ఏర్పడిన తరువాత భారత్ లో 1951లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. మొదటి పోలింగ్ 1951 సంవత్సరంలో సరిగ్గా ఈరోజు అంటే అక్టోబర్ 25న ప్రారంభం అయింది. సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించారు. భారత్ లో తోలి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకూ నిర్వహించారు. ఆ ఎన్నికల విశేషాలు తెలుసుకుందాం.

తొలి ఎన్నికల్లో లోక్‌సభలోని 497 స్థానాలు, రాష్ట్ర అసెంబ్లీల్లో 3,283 స్థానాలకు గానూ 17 కోట్ల 32 లక్షల 12 వేల 343 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 68 దశల్లో ఓటింగ్ జరిగింది. స్వాతంత్ర్య పోరాటం కారణంగా, కాంగ్రెస్ పేరు సాధారణ ప్రజలలో మారుమోగిపోయింది. దీంతో, కాంగ్రెస్ 364 సీట్లను గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారత కమ్యూనిస్టు పార్టీ 16 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో ఒక నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. 86 నియోజకవర్గాల్లో రెండు స్థానాలు, ఒక నియోజకవర్గంలో మూడు స్థానాలు ఉండేవి . అందువల్ల 489 స్థానాలకు 401 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. తరువాత ఈ విధానం మారింది. ఒక సీటుతో 314 నియోజకవర్గాలు1960 లో ఏర్పాటు చేశారు.
తొలి ఎన్నికల్లో 10.59 కోట్ల మంది తమ నాయకుడిని ఎన్నుకుని చరిత్ర సృష్టించారు. ఈ 10.59 కోట్లలో దాదాపు 85% మంది నిరక్షరాస్యులు. నిరక్షరాస్యులైన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రతి పార్టీకి ప్రత్యేక బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు. దానిపై ఎన్నికల చిహ్నాలు ఉన్నాయి. 2.12 కోట్ల ఇనుప పెట్టెలు తయారు చేశారు. 62 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు.

సుకుమార్ సేన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఓటరు నమోదు, పార్టీల ఎన్నికల చిహ్నాలను ఫిక్సింగ్ చేయడం, స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడానికి అర్హులైన అధికారుల ఎంపిక చేయడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్‌లను పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లడం చాలా కష్టంతో జరిగింది. మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో, దుప్పట్లు అదేవిధంగా తుపాకీ లైసెన్స్‌లు ఇస్తామని ఎర చూపి స్థానిక ప్రజలను పోలింగ్ బూత్‌లకు ఎన్నికల సామగ్రిని రవాణా చేయడానికి సహాయపడేలా చేసుక్కున్నారు అధికారులు. అలా మొదలైన మన దేశపు ఎన్నికల ప్రక్రియ క్రమంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఎన్నికలను ఎలా నిర్వహించాలో ప్రపంచానికి బోధిస్తున్నాము.

ఈరోజు అంటే అక్టోబర్ 25 చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్యమైన జాతీయ-అంతర్జాతీయ సంఘటనలు:

2013: నైజీరియాలో, బోకోహరాం అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 74 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

2009: బాగ్దాద్‌లో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 155 మంది మరణించారు.

2000: స్పేస్‌క్రాఫ్ట్ డిస్కవరీ 13 రోజుల మిషన్ తర్వాత భూమికి తిరిగి వచ్చింది.

1972: FBI మొదటిసారిగా మహిళా ఏజెంట్లను నియమించింది.

1960: న్యూయార్క్‌లో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ చేతి గడియారాలు మార్కెట్‌లోకి వచ్చాయి.

1955: టప్పన్ కంపెనీ గృహ వినియోగం కోసం మొదటిసారిగా మైక్రోవేవ్ ఓవెన్‌లను విక్రయించడం ప్రారంభించింది.

1924 : బ్రిటీష్ వారు సుభాష్ చంద్రబోస్‌ను అరెస్టు చేసి రెండేళ్లపాటు జైలుకు పంపారు.

1870: అమెరికాలో మొదటిసారిగా పోస్ట్‌కార్డులు ఉపయోగించబడ్డాయి.

1828 : లండన్‌లో సెయింట్ కేథరీన్స్ డాక్స్ ప్రారంభించబడింది.

1760: జార్జ్ III గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ కింగ్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి: City Transformer: ఎలక్ట్రిక్‌ కార్లలో మరో సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి కొత్త కారు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Health: డైనింగ్‌ టేబుల్‌పై భోజనం చేస్తున్నారా.? అయితే మీరు ఈ లాభాలను కోల్పోతున్నట్లే.. నేలపై కూర్చొని తింటే..

RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.? ఈ నెలలోనే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3noC1vh

Related Posts

0 Response to "First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel