-->
DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Delhi Capitals Win

DC vs CSK, IPL 2021: నువ్వా, నేనా అనే తరహాలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది. పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌లో తమ స్థానాలను పదిలం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటగా టాస్‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన చెన్నై 20 ఓవర్లలో 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు చివరి వరకు క్రీజులో నిలవడంతో చెన్నై కనీసం ఈ స్కోరైనా చేసింది. రాయుడు 43 బంతుల్లో 55 పరుగులు (2 సిక్సర్లు, 5 ఫోర్లు) చేశాడు. రాబిన్ ఊతప్ప19 పరుగులు, ధోనీ 18 పరుగులు మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అక్సర్ పటేల్‌ 2 వికెట్లు సాధించాడు.

137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫృధ్వీషా, శిఖర్ ధావన్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఫృధ్వీషా 18 పరుగులు చేసి ఔటైనా శిఖర్ ధావన్ నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 పరుగులు (2 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే చివరలో చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు సాధించారు. దీంతో ఢిల్లీ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెమ్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు సాధించారు.

Pandora Papers: పాండోరా పేపర్స్‌లో ప్రముఖుల రహస్య సంపద గుట్టు రట్టు.. దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FgszSy

Related Posts

0 Response to "DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel