-->
Danish PM India Tour: డానిష్ ప్రధాని పర్యటనలో పురూలియా ఆయుధాల కుంభకోణంలో నిందితుడు కిమ్ డేవిని అప్పగింతపై చర్చలు

Danish PM India Tour: డానిష్ ప్రధాని పర్యటనలో పురూలియా ఆయుధాల కుంభకోణంలో నిందితుడు కిమ్ డేవిని అప్పగింతపై చర్చలు

Danish Pm India Tour

Danish PM India Tour: పురులియా ఆయుధాల కుంభకోణంలో ప్రధాన నిందితుడు కిమ్ డేవిని అప్పగించాలనే డిమాండ్‌కు సంబంధించిన సమస్యను భారతదేశం అదేవిధంగా డెన్మార్క్ న్యాయవ్యవస్థ పరిశీలిస్తోందని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వెన్ శనివారం చెప్పారు. మూడురోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇద్దరు నేతల మధ్య పరస్పర సంబంధాలే కాకుండా, 1995 పురులియా ఆయుధాల కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీల్స్ హాక్ అలియాస్ కిమ్ డేవిని అప్పగించడంపై కూడా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని ఇరు దేశాల ప్రధానులు తీసుకున్నట్టు ఫ్రెడ్డీ స్వెన్ వెల్లడించారు. ఇద్దరు ప్రధానుల సమావేశంలో, కిమ్ డేవీని అప్పగించడం గురించి చర్చ జరిగింది. ఈ ప్రశ్నపై ఫ్రెడ్డీ స్వైన్ రెండు దేశాల (ఇండియా , డెన్మార్క్) న్యాయవ్యవస్థ దీనిని పరిశీలిస్తోందని చెప్పారు. ”ఈ విషయాన్ని వారికి వదిలేయాలి. వారు చాలా సమర్థులు. ఇటువంటి విషయాలను ఎలా నిర్వహించాలో తెలుసు. ఈ అంశంలోని కొన్ని విషయాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.” అని ఆయన వివరించారు.

పురూలియా ఆర్మ్స్ కేస్ ఏమిటి?

పశ్చిమ బెంగాల్ లోని పురులియా జిల్లాలో డిసెంబర్ 17, 1995 న ఒక విమానం నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు పడేశారు. మరుసటి రోజు ప్రజలు దాదాపు 300 AK 47, AK 56 రైఫిల్స్, 15,000 రౌండ్ల బుల్లెట్లు, 6 రాకెట్ లాంచర్లు, పెద్ద సంఖ్యలో గ్రెనేడ్లు, పిస్టల్స్, నైట్ విజన్ పరికరాలను కలిగి ఉన్న ఆయుధాలతో నిండిన పెట్టెలను కనుగొన్నారు. కొంతమంది గ్రామస్తులు వీటిలో కొన్ని ఆయుధాలను ఎత్తుకెళ్ళి ఇళ్ళలో దాచుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు దాడులు చేయడంతో.. అన్ని ఆయుధాలు పోలీసులకు అప్పగించారు.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో 4 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 21న థాయ్‌లాండ్ నుండి కరాచీకి వెళ్తున్న విమానం ముంబాయిలో ల్యాండ్ చేయించారు. , ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా, థాయ్‌లాండ్ నుండి కరాచీకి వెళుతున్న An-26 విమానంలో ఉన్న వెపన్స్ ఏజెంట్ పీటర్ బ్లీచ్ తో సహా ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. కానీ, ఈ ఆయుధాల కుంభకోణం ప్రధాన సూత్రధారి అయిన కిమ్ డేవి అనుమానాస్పద పరిస్థితులలో విమానాశ్రయం నుండి తప్పించుకోవడమే కాకుండా తన దేశమైన డెన్మార్క్‌కి చేరుకున్నాడు.
వీక్లీ బ్రీఫింగ్ సమయంలో ఈ వారం, విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద బాగ్చీ భారతదేశం కిమ్ డేవీ రప్పించడం సమస్యపై డెన్మార్క్ లతో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. కిమ్ డేవీని అప్పగించే అంశం కూడా తమ ఎజెండాలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా బాగ్చి చెప్పారు. దీనిపై డానిష్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా భారతదేశం ఈ సమస్యను తీవ్రంగా లేవనెత్తింది.

రెండు దేశాల మధ్య ఈ అంశాలపై చర్చలు..

  • ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన పరిణామాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
  • హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం, వాతావరణ సమస్యపై భారత్-డెన్మార్క్ చర్చలు.
  • రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, యూరోపియన్ యూనియన్ – ఇండియా సహకారంపై చర్చలు జరిగాయి.
  • ప్రధాని మోడీతో సమావేశం అనంతరం డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిశారు.

డెన్మార్క్ ప్రధాని మేట్ ఫ్రెడెరిక్సెన్ భారతదేశానికి మొట్టమొదటి పర్యటన అని మోదీ అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన నాయకుడిగా ఆయన అభివర్ణించారు. ఇక్కడ నుండి ఆమె రాజ్ ఘాట్ చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. ఆయన శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కూడా కలిశారు.

Also Read: Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?

Hugging: కౌగిలించుకోవ‌డం వ‌ల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజ‌నాలు..! మీకు తెలియ‌కుండానే జ‌రిగిపోతాయి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DoF9gY

0 Response to "Danish PM India Tour: డానిష్ ప్రధాని పర్యటనలో పురూలియా ఆయుధాల కుంభకోణంలో నిందితుడు కిమ్ డేవిని అప్పగింతపై చర్చలు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel