-->
Credit Cards: పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా షాపింగ్‌ చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు

Credit Cards: పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా షాపింగ్‌ చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు

Credit Card

Credit Cards: పండగ సీజన్‌లో బ్యాంకు కస్టమర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకుంటే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండగ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వివిధ రకాల ఆన్‌లైన్‌ దిగ్గజాలు, వివిధ రకాల కంపెనీలు కొనుగోళ్లపై బంపర్‌ ఆఫర్లు ఇస్తుంటాయి. ఎక్కువగా క్రెడిట్‌, డెబిట కార్డులపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లను కస్టమర్ల సద్వినియోగం చేసుకుంటారు. కార్డు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కార్డుపై బ్యాలెన్స్‌ ఉంది కదా అని ఎడపెడ ఖర్చు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే..

పండగ సీజన్‌లో ఆఫర్ల ఇచ్చారు కదా అని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ కార్డు చెల్లింపుల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ క్రెడిట్‌ కార్డుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చెల్లించినట్లయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంటుంది. ఆలస్యంగా చెల్లించినట్లయితే అధిక వడ్డీ పడుతుంది. అలాగే మీ క్రెడిట్‌ కార్డుపై కూడా నగదు తీసుకోవడానికి కూడా అనుతిస్తాయి. చాలా మంది కూడా క్రెడిట్‌ కార్డుల నుంచి నగదును విత్‌డ్రా చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ నగదుపై భారీగా వడ్డీ పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులపై నగదును ఉపసంహరించుకోవద్దు. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే ట్రాన్సాక్షన్ లిమిట్ తక్కువగా పెట్టుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించొచ్చు. అందుకే క్రెడిట్‌ కార్డు వాడుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవాల్సి ఉంటుంది. లిమిట్‌ పెంచారు కదా అని దుబారా ఖర్చులు చేస్తే సమయానికి చెల్లించని పక్షంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

రివార్డు పాయింట్లు:

ఏదైనా క్రెడిట్‌ కార్డు తీసుకున్నప్పుడు రివార్డు పాయింట్లు కూడా ఉంటాయి. మీరు షాపింగ్‌ చేసినదాని బట్టి మీకు రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు వాడుకోవడం మంచిది. లేకపోతే గడువు ముగిసిపోతే అవి వృథా అవుతుంటాయి. కొన్ని క్రెడిట్‌ కార్డులపై గడువు సంవత్సరం వరకు గడువు ఉంటుంది. కొన్ని కార్డులపై గడువు తక్కువగా ఉంటుంది. ఈ గడువు విషయాన్ని ముందుగానే గమనించడం మంచిది.

సిబిల్‌ స్కోర్‌..

క్రెడిట్‌ కార్డుపై సిబిల్‌ స్కోర్‌ ఉండేలా చూసుకోవాలి. మీరు సరైన సమయంలో కార్డు బిల్లు చెల్లించనట్లయితే సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది. అలాంటి సమయంలో మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో ఈ స్కోర్‌ ప్రభావం పడుతుంది. బ్యాంకు నుంచి మీరు రుణం పొందాలంటే మీ సిబిల్‌ స్కోర్‌పై ఆధార పడి ఉంటుంది.

క్రెడిట్‌ కార్డుపై లోన్‌:

కాగా, మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్‌ కార్డుపై రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని ఎక్కువగా క్రెడిట్ కార్డ్ వాడేస్తే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్‌ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!

ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BFXgyx

0 Response to "Credit Cards: పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా షాపింగ్‌ చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel