-->
Chhattisgarh: సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు.. వారిలో 9 మంది మహిళలు

Chhattisgarh: సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు.. వారిలో 9 మంది మహిళలు

Maoist

Chhattisgarh: ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు గట్టి దెబ్బ తెగిలింది. ఏస్పీ సునీల్ దత్ శర్మ , సేఆర్పీఎఫ్ అధికారుల ముందు 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వీరంతా అనేక కేసుల్లో నిందితులని . ఏస్పీ సునీల్ దత్ శర్మ చెప్పారు. వీరు మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసేవారని, వీరిలో ఒక మావోయిస్ట్ పై లక్ష రూపాయలవరకు రివార్డు ఉందని తెలిపారు. మిగతా వారి అందరిపై ఒక్కొక్కరికి రూ. 10 వేల రివార్డు ఉందని వీరంతా ఏస్పీ సునీల్ దత్ శర్మ చెప్పారు, కుకనార్ గాడిరాస్, పుల్బాజీ, చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిదిలలోని గ్రామాలకు చెందినవారని sp సునీల్ దత్ శర్మ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో ఒక్కసారిగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది చెప్పుకోవచ్చని అంటున్నారు.

‘పునా నార్కోమ్’జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో లొంగిపోయిన నక్సల్స్ నక్సల్స్ లు ఇకనుంచి నివసించనున్నారు. వీరికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరావాస విధానం ప్రకారం సౌకర్యాలు అందించనుంది. ఈ ఏడాది ఆగష్టు నుంచి ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి మొత్తం హింసను విడిచి పెట్టిన వారి సంఖ్య 176 కి చేరుకుంది.

Also Read:  తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ.. గ‌రుడ వాహ‌నం దర్శనం.. స‌ర్వపాప హరణం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ncnkv2

0 Response to "Chhattisgarh: సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు.. వారిలో 9 మంది మహిళలు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel