
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా..! అయితే కొవ్వు కరిగిస్తున్నారా లేదా కండరాలు కోల్పోతున్నారా..?

Weight Loss: బరువు తగ్గడం అంటే శరీరం నుంచి అదనపు కొవ్వును కోల్పోవడం. కానీ చాలామంది తప్పులు చేస్తున్నారు. సరియైన పద్దుతులు పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చాలామంది బరువును తగ్గించే క్రమంలో కండరాలను కోల్పోతున్నారు. ఇది దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మనం సరైన పద్దతులను పాటిస్తే శరీరం కండరాలను కోల్పోదు. కానీ క్రాష్ డైట్లను పాటిస్తూ, ఇష్టమొచ్చిన విధంగా వ్యాయామాలు చేస్తే ఇదే జరుగుతుంది. మీరు ఈ 4 విషయాలను తెలుసుకుంటే అసలు స్టోరీ అర్థమవుతుంది.
1. వేగంగా బరువు కోల్పోతున్నారా..
కొవ్వు తగ్గడం అనేది చాలా నెమ్మదైన ప్రక్రియ. ఒకవేళ మీరు వేగంగా బరువు తగ్గుతున్నారని అనుకుంటే కొవ్వుకు బదులు కండరాలు తగ్గుతున్నాయని అర్థం. వేగంగా బరువు తగ్గితే మళ్లీ అంతే వేగంగా బరువు పెరుగుతారు.
2. నీరసంగా ఉంటారు
మీరు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సమయానికి నిద్రపోవడం వల్ల ఎటువంటి నీరసం ఉండదు. కానీ ఇవన్నీ పాటించిన తర్వాత కూడా మీకు నీరసం అనిపిస్తే బరువు తగ్గించే పద్దతుల్లో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. వెంటనే తెలుసుకొని సరిదిద్దుకోవాలి. లేదంటే ఆ ఎఫెక్ట్ కండరాలపై పడుతుంది.
3. కొవ్వును కోల్పోవడం జరుగదు
4. మీరు చెడు మూడ్‌లో ఉన్నారు
కండరాల నష్టం అంటే శక్తి కోల్పోవడం. ఇది మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. టెన్షన్, చిరాకు పెరుగుతాయి. ఇది కాకుండా మీకు తలతిరగడం వంటి కొత్త సమస్యలు వస్తాయి. ఎందుకంటే శరీరం అలసిపోయినప్పుడు, శక్తి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు మీ మెదడు సమర్థవంతంగా పనిచేయదు. మీ మానసిక స్థితి కూడా చెడుగా ఉంటుంది.
SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కి చివరి తేదీ ఎప్పుడంటే..
Hyderabad Crime News: ఏటీఎం నుంచి సరికొత్త రీతిలో దోపిడీ.. అది చూసి షాకైన బ్యాంక్ అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..
NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!
Baca Juga
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YbUouR
0 Response to "బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా..! అయితే కొవ్వు కరిగిస్తున్నారా లేదా కండరాలు కోల్పోతున్నారా..?"
Post a Comment