
Bigg Boss Shyamala: షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల.. తాను పాదయాత్రకు మద్దతివ్వడానికి కారణం అదేనంటూ వ్యాఖ్య..

Bigg Boss Shyamala: తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు గాను ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా బుధవారంతో షర్మిల పాదయాత్ర 8 రోజులకు చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది.
ఇందులో భాగంగా తాజాగా బుధవారం షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. షర్మిలతో కలిసి కాసేపు పాదయాత్ర చేసిన శ్యామల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సమాజంలో మార్పు తెచ్చేందుకు షర్మిల అక్క చేపట్టిన పాదయాత్రలో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానిని. ఈ కారణంగానే షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చాను’ అని తెలిపారు.
శ్యామలా ఇంకా మాట్లాడుతూ.. ‘ఒకవైపు మహానేత కుమార్తె, మరోవైపు సీఎంకు సోదరి అయిన అక్క షర్మిల సంతోషంగా జీవించొచ్చని.. కానీ ఆమె తన నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు కొనసాగుతుండటం చాలా గొప్ప విషయం’ అంటూ శ్యామలా చెప్పుకొచ్చారు.
షర్మిలమ్మ గారి ప్రజాప్రస్థానం పాదయాత్ర కి తన మద్దతు తెలిపి పాదయాత్ర లో పాల్గొన్న యాంకర్ శ్యామల. @AnchorShyamala #PrajaPrasthanam pic.twitter.com/NCAMcQtPcl
— YSRTP (@YSSR2023) October 27, 2021
Also Read: Neem trees: అంతుచిక్కని కారణం.. నిట్టనిలువునా ఎండిపోతున్న వేపచెట్లు
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..! ఎందుకో తెలుసా?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nAeiYZ
0 Response to "Bigg Boss Shyamala: షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల.. తాను పాదయాత్రకు మద్దతివ్వడానికి కారణం అదేనంటూ వ్యాఖ్య.."
Post a Comment