-->
Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..

Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..

Bigg Boss

బిగ్‏బాస్ సీజన్ 5.. గత సీజన్లకు ఏ మాత్రం పోలిక లేదు. అన్ని సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్స్‏తో ఈ షో మొదలు కాగా.. నాలుగు వారాలు పూర్తై.. ఐదోవారం వచ్చేసరికి నలుగురు ఎలిమినేట్ అయి 15 మంది మిగిలారు. అయితే ముందు రోజు ఇంట్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకరు కాకపోతే మరొకరు బూతులు మాట్లాడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ వారం రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ ఇచ్చి.. రాజు, సన్నీలకు రాజ్యాలు కేటాయించి .. ఇంటి సభ్యులను విభజించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు గెలిచి రాజ్యాన్ని దక్కించుకుంటారో వారే కెప్టెన్సీ కోసం తలపడతారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లు గొడవలు, కొట్లాట వరకు వెళ్లింది. అదెంటో తెలుసుకుందామా.

ముందుగా ఇంటి సభ్యులకు కుస్తీ పోటీ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఒక్కో టీం నుంచి ఒక్కో ఇంటి సభ్యుడు పోటీ పడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. సన్నీ టీం నుంచి ప్రియాంక, మానస, జెస్సీలు.. రవి టీం నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్ పోటీ పడ్డారు. అయితే ముందుగా విశ్వ, మానస్ పోటీ పడ్డారు. ఇందులో కండలు తిరిగిన విశ్వకు గట్టి పోటీ ఇచ్చాడు మానస్. అయితే ఇందులో ముందుగా మానస్.. విశ్వను కిందపడేసాడు.. అయితే సంచాలకుడిగా ఉన్న శ్రీరామ్
అతి తెలివితో విశ్వ పూర్తిగా కింద పడలేదని చెబుతూ… మరోసారి పోటీ పెట్టాడు. దీంతో ఈసారి విశ్వ మానస్‏ను ఓడించాడు. ఇక రవి టీంలో శ్రీరామ్, రవి ఇద్దరు అబ్బాయిలు ఉన్నగానీ.. అమ్మాయిల పేర్లను ప్రకటించడాన్ని సన్నీ వ్యతిరేకించాడు. ఈ విషయంలో శ్వేత కూడా రవిని వ్యతిరేకించింది. ఇక జెస్సీతో పోటీ పడటానికి యానీ మాస్టర్ సంకోచించింది. దీంతో ఆమెకు మద్దతుగా శ్రీరామ్, రవిలు సైతం జెస్సీని పోటీకి పంపడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మానస్ ఫైర్ అయ్యాడు. ప్రతి సారి మేమేందుకు కన్వీన్స్ కావాలి అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో చేసేదేం లేక..శ్రీరామ్, రవి, యానీ మాస్టర్ పోటీకి ఒప్పుకున్నారు. ఇక వీరిద్దరి కుస్తీలో జెస్సీ గెలిచాడు.

ఇక ఓ పక్క బయట గేమ్ ఆడుతుంటే లోపల షణ్ముఖ్, సిరి, ప్రియాంకలు కాయిన్స్ దొంగతనం చేసే పనిలో పడ్డారు. దీంతో విశ్వ ఫైర్ అయ్యాడు. బయట ఆడవాళ్లు గేమ్ ఆడుతుంటే.. లోపల కాయిన్స్ దొంగతనం చేశారు. దమ్ముంటే ఆడి గెలవాలి.. అంతేకానీ దొంగబుద్దులు ఏంటీ.. గుంటనక్కలు చాలా మంది ఉన్నారు.. అంటూ ఇంకా అసభ్య పదాలతో రెచ్చిపోయాడు. దీంతో మానస్ అడ్డుకుంటూ మాటలు సరిగ్గా మాట్లాడాలని.. అందరిని కలిపి అనొద్దని… ఎవరు చేశారో వాళ్లను అను అంటూ వారించాడు. కానీ విశ్వ మాత్రం అస్సలు తగ్గకుండా.. మరింత రెచ్చిపోయాడు.

Also Read: Bigg Boss 5 Telugu: అసలైన గేమ్ స్టార్ట్ చేశారుగా.. ఇంట్లో రాజుగారి గోడ రచ్చ… కొట్టుకున్న శ్రీరామ్-జెస్సీ…

Samantha: ఇక మీదట సమంత ఉండబోయేది అక్కడేనట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ నిజమేనా ?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3uMgznf

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel