-->
Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్..

Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్..

Lobo

బిగ్‏బాస్ సీజన్ 5.. వారం మొత్తం ఎలా ఉన్నా.. ప్రేక్షకులు వెయిట్ చేసేది మాత్రం నాగార్జున కోసమే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంటి సభ్యులు చేసిన గొడవలను, తప్పులను, వ్యవహరాన్ని పూర్తిగా నాగ్ ప్రశ్నించేది శనివారం మాత్రమే. అందుకే ఆ రోజు కోసమే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈసారి సీజన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి నుంచి షో అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయిన.. అలవాటైన జనాలు మాత్రం చూడటం మానలేదు. మొదటి వారం నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ షోలో స్త్రీలపై అరవడం కామన్‏గా మారిపోయింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియలో లోబో ప్రవర్తించిన తీరు గురించి తెలిసిందే. ప్రియ పై అరుస్తూ నానా హంగామా చేశాడు. మరి శనివారం వచ్చిన నాగార్జున.. ఈ విషయంపై ఎలా స్పందించాడో తెలుసుకోవాలంటే.. నిన్నటి ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎప్పుడూ.. సూపర్ హిట్ సాంగ్స్‏తో స్టెప్పులెస్తూ ఎంట్రీ ఇచ్చే నాగ్.. నిన్న మాత్రం ఓ స్పెషల్ సాంగ్‏తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక నిన్న గాంధీ జయంతి కావడంతో ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత శుక్రవారం జరిగిన విషయాలను చూపించారు. ఇక రావడంతోనే జెస్సీపై జాలి పడ్డాడు. అందరూ కలిసి నిన్న తొక్కేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్, సిరి ఇద్దరికి క్లాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో తప్పు చేసిన ఎవరు అంటూ అడగ్గా.. జెస్సీ నిల్చోవడం.. ఆ తర్వాత శ్వేత లేచి తప్పు చేశాను.. జెస్సీని వరస్ట్ పర్ఫామర్‏గా సెలెక్ట్ చేశా.. అని చెప్పగా.. మరి ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నావు తిరిగి ప్రశ్నించగో లోబో అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే… ప్రియపై అరవడమే కాకుండా.. తినొద్దని బిగ్ బాస్ చెప్తే.. వినకుండా తినేసి.. జెస్సీకి పనిష్మెంట్ వచ్చేట్టు చేశాడు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున లోబోపై ఫైర్ అయ్యాడు. ఏం లోబో తప్పు చేశానని అనుకుంటున్నావా ? అని అడగ్గా.. నా వరకూ నేను కరెక్ట్ చేశా.. బరాబర్ చేశా.. జనానికి ఏం నచ్చుతుందో నచ్చదో తెలియదు అన్నాడు. అంటే అరవడం కూడా బరాబర్ నా అని అడగ్గా.. ఆమెకు సారి చెప్పా.. నా ప్రేమ గురించి హర్ట్ అయ్యేట్టు మాట్లాడింది అందుకే అరిచా అని చెప్పుకొచ్చాడు. నీ ఒక్కడికే ఉందే ప్రేమా? అంత అరిచి చించుకోవాల్సిన అవసరం ఏముంది అని అడగ్గా.. నేనేం చించుకోలేదు అన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నాగ్.. వీడియో చూపించేశాడు. ఐడోన్ట్ కేర్ జనాలు అని నువ్వే అంటావు.. జనం వల్లే నేను ఇక్కడికి వచ్చానని అంటావు.. ఏం అనుకోవాలి.. నీ గురించి మాట్లాడితే..మాట్లాడితే బస్తీ బస్తీ అంటావు..మా మనస్తత్వం వేరు విల్లా మనస్తత్వం వేరే అంటావు. ఇది బిగ్ బాస్ ఇళ్లు.. అంతా ఒక్కటే.. నీ బస్తీ కార్డ్ ఇక్కడ ఉపయోగించకు … నీకు 1 మినిట్ టైం ఇస్తున్నా.. ఆరోజు ఎా అరిచావో చూపించు అని అన్నారు. దీంతో ఇరుక్కుపోయిన లోబో.. నాకు గుర్తులేదు సార్ తప్పు అయ్యింది ఇంకోసారి కోప్పడను.. మీరు ఎలాంటి శిక్ష విధించినా అనుభవిస్తా అని చెప్పాడు. నువ్ అదొక్కటి చేసిన తప్పు కాదు.. నీ వల్ల జెస్సీ కూడా బాధపడ్డాడు అని ఫుల్ క్లాస్ తీసుకున్నారు నాగ్.

Also Read: Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‏ను జంతువులతో పోలుస్తున్న నటరాజ్ మాస్టర్.. ఫైర్ అవుతున్న

నెటిజన్స్..

Bigg Boss 5 Telugu:  మోడల్ నిజంగానే ఇన్‏ఫ్లూయెన్స్ అవుతున్నాడా ?.. మరోసారి జైలుకు వెళ్లిన జెస్సీ..

Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZIej4M

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel